Hollywood actors in Anushka movie
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఏడాది గ్యాప్ తర్వాత నటించడానికి సిద్ధమైంది. కోనవెంకట్ నిర్మాణంలో హేమంత్ దర్శకత్వంలో నటించబోయే థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాలో అనుష్క దివ్యాంగురాలిగా కనపడబోతున్నారు. `సైలెన్స్` పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమాలో హలీవుడ్ మైకేల్ మాడ్సన్ విలన్‌గా నటించబోతున్నారు. మాధవన్ కీలకపాత్రలో నటించబోతున్నారు. మార్చిలో ప్రారంభం కాబోయే ఈ సినిమాను 40కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమా ఎక్కువ భాగం యు.ఎస్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. గత ఏడాది `భాగమతి` తర్వాత అనుష్క బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఆమె వెయిట్ తగ్గిన తర్వాత చేస్తోన్న సినిమా ఇది.