Saturday, October 5, 2024

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రన్న పాలనలో చల్లగా ఉండాలి : హోంమంత్రి

శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మని దర్శించుకున్న హోంమంత్రి అనిత

అమరావతి, అక్టోబర్, 03; దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా తొలిరోజున శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో కొలువై ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో హోంమంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి దర్శనాంతరం వేద పండితులు హోం మంత్రి అనితకు ఆశీర్వచనాన్ని అందజేశారు.

ఈవో ఛైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రాలను ఆమెకు అందించారు. దేవీ శరన్నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకరణలలో దర్శనమివ్వనున్న అమ్మవారిని మొదటి రోజున శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శించుకోవడం మహా భాగ్యమని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular