భారత్ లోకి హానర్ వ్యూ20

HONOR VIEW20 IN INDIA

  • 48 ఎంపీ కెమెరా, పెద్ద డిస్ ప్లే
  • నేటి నుంచి అమెజాన్ లో లభ్యం

చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల దిగ్గజం హువావో మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. తన అనుబంధ బ్రాండ్ హానర్ ద్వారా వ్యూ20 పేరుతో ఈ ఫోన్ విడుదల చేసింది. ప్రపంచంలోనే ఐఏ ఆధారిత 48 మెగా పిక్సెల్‌ భారీ కెమెరాతో వస్తున్న స్మార్ట్ ఫోన్ అంటూ పేర్కొన్న హానర్‌.. ఎట్టకేలకు తన వ్యూ20 ఫోన్ ను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పంచ్ హోల్ డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతోపాటు 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. నాలుగు రంగుల్లో, రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తోంది. అమెజాన్ లో బుధవారం నుంచి అమ్మకాలు మొదలుకానున్నాయి. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.37,999 కాగా, 8జీబీ+256జీబీ ధర రూ.45,999గా నిర్ధారించారు.

వ్యూ20 ఫీచర్లివే…
6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ పై
1080×2310 పిక్సెల్స్ రిజల్యూషన్‌
ఆక్టాకోర్ కిరిన్ 980 ప్రాసెసర్
6జీబీ/8జీబీ ర్యామ్
128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌
48ఎంపీ రియర్‌ కెమెరా మెగాపిక్సెల్
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

MOBILE MARKET

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article