హానర్ నుంచి విప్లవాత్మక ఫోన్

HONOR VIEW20 SMART PHONE

  • భారీ కెమెరాతో హానర్ వ్యూ20 ఆవిష్కరణ
  • 29 నుంచి అమెజాన్ లో విక్రయాలు

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువావేకి చెందిన హానర్ బ్రాండ్ నుంచి కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ రాబోతోంది. అద్భుతమైన ఫీచర్లు, భారీ కెమెరాతో తయారుచేసిన హానర్ వ్యూ20 స్మార్ట్ ఫోన్ ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకతల్లో కెమెరాదే తొలి స్థానం. ఏకంగా 48 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన కెమెరాను ఏర్పాటు చేశారు. ఇంత భారీ కెమెరా ఉన్న ఫోన్ ప్రస్తుతానికి ఇదే కావడం విశేషం. ఇక 25 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఫ్రంట్ కెమెరా ఉంది. తొలిసారిగా స్క్రీన్ లోనే అంతర్భాగంగా సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 6.4 అంగుళాల డిస్ ప్లేతో ఉన్న ఈ ఫోన్ మూడు వేరియంట్లలో, నాలుగు రంగుల్లో లభ్యం కానుంది. ఈనెల 29 నుంచి భారతీయ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ లో ఈ ఫోన్ ను విక్రయించనున్నారు. ముందస్తుగా ఈ ఫోన్ బుక్ చేసుకున్నవారికి రూ.2,999 విలువ కలిగిన ఇయర్ ఫోన్స్ ను ఉచితంగా ఇవ్వనున్నారు. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.35,500. 8జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 40,600గా ఉంది.

హానర్‌ వ్యూ20 ఫీచర్లు ఇవే…
6.4 అంగుళాల డిస్‌ప్లే
కిరిన్‌ 980 ఆక్టాకోర్‌  సాక్‌
ఆండ్రాయిడ్‌ 9
1080×2310 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
48 ఎంపీ రియర్‌ కెమెరా
25 ఎంపీ సెల్పీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

హానర్ నుంచి విప్లవాత్మక ఫోన్
https://tsnews.tv/honor-view20-smart-phone
 
View Complete Specifications on Amazon CLICK HERE
 
BUY MORE HONOR MOBILES IN DISCOUNT Click Here 
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article