AP అసెంబ్లీలో హాట్ టాపిక్స్

131
Hot Topics In AP Assembly
Hot Topics In AP Assembly

Hot Topics In AP Assembly

ఎప్ప‌టిలానే వంశీ.. ఎప్ప‌టిలానే చంద్ర‌బాబు ఎప్ప‌టిలానే ఏపీ అసెంబ్లీ కొలువుతీరెనచ‌ట‌.. ముందున్న జోష్ ఇప్పుడు లేద‌ని బాధ‌ప‌డుతూ ఉన్న‌ప్ప‌టికీ గోరంట్ల ఏదో ఒక‌టి మాట్లాడుతూ మాట్లాడుతూ త‌న ఉనికి అధినేత ద‌గ్గ‌ర చాటుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి చేస్తూ ఉన్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ ప‌ద్ధ‌తి న‌చ్చ‌క‌, అక్క‌డి అధినేత మొద‌లుకుని పుత్ర ర‌త్నం బ్యాచ్ రాస్తున్న రాత‌లు కిట్ట‌క ఒక నేత పార్టీ వ‌ద్ద‌నుకుని ఇటుగా వచ్చేరు. ఆయ‌న‌కు జ‌గ‌న్ ప‌ద్ధ‌తి న‌చ్చింద‌ని వినికిడి. అంతేకాక స్పీక‌ర్ ను సైతం త‌న‌ను ఓ ప్ర‌త్యేక స‌భ్యునిగా ప‌రిగ‌ణించాల‌నీ వేడుకున్నారు.  ఈ నేప‌థ్యంలో ఇవాళ వంశీ మోహ‌న్ వ‌ల్ల‌భ‌నేని కొత్త ప‌ద్ధ‌తికి తెర‌లేపారు.. విప‌క్ష నేత‌లు మాట్లాడుతుండ‌గా ఇంటి గుట్టును లీక్ చేసేందుకు త‌న వంతు చొర‌వ చూపారు.
అందుకు అనుగుణంగా కొన్ని స్లిప్పుల‌ను గౌర‌వ స‌భ్యులు అంబ‌టి రాంబాబుకు పంపారు. ఇవే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారేయి. వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ ఏం రాసి పంపారో ఏం చెప్పాల‌నుకున్నారో అన్న‌వి కీల‌కం అయ్యాయి.. మొత్తానికి ఇంటి గుట్టు ర‌ట్టు చేసిన విభీషుణుడి పాత్ర‌లో  ఆయ‌న రాణిస్తున్నారా???
లేదా కేవ‌లం చంద్ర‌బాబుపై కోపంతోనే సొంత సామాజిక‌వ‌ర్గం అయినా లెక్క చేయ‌క త‌న ప‌ని తాను ముందు అనుకున్న ప్ర‌కారం చేసుకుంటూ పోతున్నారా అన్న‌ది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న హాట్ టాపిక్.

AP POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here