రాజమౌళి కోసం అల్లు అర్జున్ త్యాగం

129
How Allu Arjun Helps Rajamouli
How Allu Arjun Helps Rajamouli

How Allu Arjun Helps Rajamouli RRR?

మీరు చదివింది కరెక్టే. రాజమౌళి కోసం అల్లు అర్జున్ త్యాగమే చేస్తున్నాడు. లేదంటే రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు ఇబ్బందులు తప్పవు. ఏంటీ స్టేట్మెంట్ చాలా పెద్దగా అనిపిస్తోంది కదూ.. నిజమే.. ఇప్పుడు అల్లు అర్జున్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన బిగ్గెస్ట్ స్టార్ కదా.. ఆ మాత్రం బిల్డప్ ఉండాలిగా.. అద్సరే ఏ విషయంలో రాజమౌళి కోసం త్యాగం చేశాడూ అంటారా..? అది తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి.. మరికొంచెం ముందుకు వెళ్లాలన్నమాట. ముందుగా వెనక్కే వెళదాం.. అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ యాటిట్యూడ్ లో ఎంత మార్పు వచ్చిందో పరిశ్రమ మొత్తం గమనిస్తూనే ఉంది. అంత పెద్ద హిట్ ను తలకెక్కించుకోవడం అంటే చిన్న మాటలు కాదు. కానీ అల్లు అర్జున్ ఎక్కించుకున్నాడు. ఆ క్రమంలోనే అతని లాంగ్వేజ్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ కొట్టొచ్చినట్టుగా ఏకంగా పరిశ్రమపైనే ఆధిపత్య ధోరణిలో కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం చేసిన త్యాగం కనిపిస్తుంది.
ఇప్పుడు ముందుకు వెళదాం.. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తోన్న ఆర్ఆర్ఆర్ ను జనవరి 8న విడుదల చేస్తాం అని అఫీషియల్ గా ప్రకటించారు కదా. అయితే ముందుగా అల్లు అర్జున్ ఆ టైమ్ లో మరోసారి సంక్రాంతికి రావాలనుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో చేస్తోన్న ఎర్రంచందనం బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని గతంలోనే ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రాజమౌళి అదే టైమ్ కు వస్తుండటంతో పాపం ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమాను ఇబ్బంది పెట్టడం ఎందుకని.. బన్నీ సైడ్ అవుదామని డిసైడ్ అయ్యాడు. అంటే అతను సమ్మర్ కు వస్తాడు. ముందే పూర్తయితే డిసెంబర్ కే దిగుతాడు. కానీ రాజమౌళిని మాత్రం ఇబ్బంది పెట్టే ఆలోచనలో లేడు. అంటే ఆ సినిమా కోసం ఎంత త్యాగం చేసినట్టో మీకు అర్థమౌతోందా..?

#Allu Arjun ,#Rajamouli ,#RRR

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here