How Bjp Develops Hyderabad?
గోల్కొండ కోట పై ఎప్పుడో జాతీయ ఎగవేశామని.. మళ్లీ కాషాయా జెండా అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ప్రజలకు ఎవ్వరు నచ్చితే వాళ్లదే అధికారమన్నారు. లాక్ డౌన్ వల్లే ఆర్థిక సంక్షేభం దేశానికి రాలేదు..దానికంటే ముందే రెండేళ్ల నుంచి సంక్షోభంలో ఉందన్నారు. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 చోట్ల గెలిచామని, ఈ సారి 10 సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం తో తమకు ఎలాంటి పొత్తులు లేవని, మళ్ళీ టీఆరెస్ అభ్యర్థి మేయర్ గా అవుతారని జోస్యం పలికారు. హైదరాబాద్ అభివృద్ధికి తామేం చేశామో చూపిస్తామన్నారు. బీజేపీ ఏం చేసిందో చూపిస్తారా అని సవాల్ విసిరారు. బీజేపీ హైదరాబాద్ కు ఏం చేస్తుందో? ఎన్ని నిధులు ఇస్తదో చెప్పి ఓట్లు అడగాలని హితువు పలికారు. టీఆరెస్ ఎవ్వరి బి-టీమ్ కాదని, తెలంగాణ ప్రజల ఏ-టీమ్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన పడటానికి తాము కారణం కాదన్నారు.