రైతు భీమా 2021-22 పాలసీ సంవత్సరం

కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులు మరియు ఇంతకుముందు రైతు భీమా చేసుకోని రైతులు ఈ సంవత్సరం రైతు భీమా (రైతు మరణిస్తే వచ్చే 5 లక్షల భీమా) చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కావున రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

నియమ నిబంధనలు

▪️రైతు భూమి 03.08.2021 లోపు రిజిస్టర్ చేసుకొని ఉండాలి.

▪️రైతులు 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అంటే 14.08.1962 నుండి 14.08.2003 మధ్య జన్మించి ఉండాలి.

▪️వయస్సు పక్కాగా ఆధార్ కార్డ్ ప్రకారమే తీసుకుంటారు. అందులో ఎలా ఉంటే అదే ప్రామాణికం.

▪️ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలో మాత్రమే భీమాకు అవకాశం ఉంటుంది.

▪️రైతే స్వయంగా వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ AEO కు అందజేయాలి.

▪️AEO మరియు MAO లు వాళ్ళ లాగ్ ఇన్ నుండి 12.08.2021 లోపే LIC కి పంపాలి. కావున రైతులు 11.08.2021 లోపే అప్లికేషన్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళవి ఆన్లైన్ చేయడానికి వీలు అవుతుంది.

▪️ఇప్పుడు మీరు భీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు భీమా చేసుకోవడానికి అవకాశం ఉండదు.

▪️రైతు మరణించిన తరువాత వచ్చి ఎంత మంది అధికారులను, ప్రజా ప్రతినిధులను అడిగినా కూడా భీమా సొమ్ము ఇప్పించలేము. కాబట్టి, ఇప్పుడే మూడు అడుగులు వేసి 3 కాగితాలు అందివ్వండి. మీ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుండి రక్షించండి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article