యుద్ధ మేఘాలు…కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు

120
How Will US-Iran Conflict Impact Stock Market?
How Will US-Iran Conflict Impact Stock Market?
How Will US-Iran Conflict Impact Stock Market?
యుద్ధ మేఘాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. అమెరికా, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు భారత మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఒక్క మూడు గంటల్లోనే మూడు లక్షల కోట్లు ఆవిరయ్యాయి . అలాగే అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మొదట సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో 500 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను ప్రారంభించిన  బీఎస్ఈ సెన్సెక్స్ .. ఆ తరువాత 40, 764 వద్ద, నిఫ్టీ 210 పాయింట్లు పతనమై 12, 016 వద్ద ట్రేడ్ అయ్యాయి. అయితే మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 212 పాయింట్లు పతనమయ్యాయి. ఇరాన్ తో కయ్యానికి రెడీ అంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అదే పనిలో పనిగా ఇరాక్ మీద కూడా ఆంక్షలు విధిస్తానని ప్రకటించారు. ఈ హెచ్చరిక ఎఫెక్ట్ వీటిపై పడింది. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ జనరల్ సోలిమని ఇరాక్ లో మృతి చెందడంతో అంతర్జాతీయంగా గోల్డ్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. బంగారం ధర ఏడు నెలల గరిష్టానికి, క్రూడ్ ధర ఆరు నెలల గరిష్టానికి ఎగబాకాయి. అటు-దేశీయంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సెన్సెక్స్ సూచీలను కుదిపేయడం విశేషం. డాలర్ తో రూపాయి మారకం విలువ 31 పాయింట్లు తగ్గి.. 72. 10 గా కొనసాగింది.మొత్తానికి ఇరాన్ , అమెరికా ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ముందు ముందు ఎలా ఉంటాయో అన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here