చెట్టును కౌగలించుకుంటే ఆక్సిజన్?

IF YOU HUG THE TREES, YOU WILL RECEIVE MORE OXYGEN. JAPANESE FOLLOW THIS PRINCIPLE SINCE LONG TIME.

248

కరోనా నేపథ్యంలో చాలా మంది శరీరంలో ఆక్సీజన్ తగ్గుతున్న మాట వాస్తవమే. అయితే, ఆక్సీజన్ పెంపొందించుకునేందుకు జపాన్ ప్రజలేం చేస్తారో తెలుసా? చెట్లను కౌగలించుకుంటారు. ఔను. మీరు చదివింది నిజమే. వారు చెట్టును కౌగించుకుంటారు. దీని వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

చెట్ల ద్వారా మాత్రమే ఆక్సిజన్ వస్తుందనే విషయం మనలో అందరికీ తెలిసిందే. ఇందులో కొన్ని శరీరంలో ప్రాణ శక్తి ప్రవాహం కూడా పెంచుతాయి. వేప, రావి వంటి పంచ వృక్షాలు, ఔషధ మొక్కలు, చెట్లు అత్యధిక మొత్తం ఆక్సీజన్ విడుదల చేస్తాయి. వీటి నుండి విడుదలయ్యే గాలి వల్ల కూడా అనేక వ్యాధులు నయం అవుతాయి. జపాన్ దేశంలో శరీర ఆక్సీజన్ మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం 10 నుండి 15 నిమిషాల వరకు శరీరం మొత్తం తగిలేట్లు కౌగిలించుకుని ఉంటారు. వారి యొక్క సగటు ఆయుర్దాయం ఎక్కువ ఉండటానికి ఇదొక కారణం. మన దేశంలో కూడా చెట్లను పూజించడం, ప్రదక్షిణలు చేయడం.. వాటి క్రింద ధ్యానం చేస్తుంటారు. ప్రకృతిలో గడపడం కోసం అడవి దేవతల ను ఆరాధన పేరుతో 2,3 రోజులు అడవి లో గడిపి శరీర ఆక్సీజన్ మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటారు. ఇవి మన సాంప్రదాయం లో భాగంగా ఉన్న వీటిని విస్మరించడం వల్లే అనేక అనర్థాలు జరుగుతున్నాయి.

చెట్ల కౌగలింతకు అనుకూలంగా ఉండే చెట్లు వేప మరియు రావి. ఈ సమయంలో శ్వాస పై ధ్యాస ఉంచడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. వేప మరియు రావి కలిసి ఉన్న చోట ధ్యానము లేదా ప్రాణాయామం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అతి ఎక్కువ ప్రాణ శక్తి ఉన్న చెట్లలో వెదురు ఒకటి అని గుర్తుంచుకోండి. మన ఇంటి పరిసరాల్లో ఒక వేప చెట్టు ఉంటే మన రోగ నిరోధక శక్తి, ఆయుష్షు పెరుగుతాయి అనేది నిర్వివాదాంశం. పళ్ళు, పచ్చి కూరగాయలు, గింజలు , ఆకులు తినడం వల్ల శరీర ఆక్సీజన్ స్థాయిలు పెరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here