Friday, April 18, 2025

ఖైరతాబాద్ గణేశుడికి భారీగా విరాళాలు

ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో విరాళాల వర్షం కురిసింది. ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా హుండీ ఆదాయం వచ్చి చేరింది. కేవలం హుండీ కానుకల ద్వారానే 70 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.

ఇక మహా గణపతికి సంబంధించిన హోర్డింగ్లు, ప్రకటనల ద్వారా మరో రూ.40 లక్షలు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. దీనికితోడు ఆన్‌లైన్ ద్వారా విరాళాల సేకరణ జరిగింది. అంటే.. ఈసారి ఖైరతాబాద్ మహా గణపతికి రూ.కోటికిపైనే ఆదాయం వచ్చిందనమాట. హుండీ లెక్కింపును తొలిసారిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరపడం విశేషం.

నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి…
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా సోమవారం ఉదయం ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్రల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇవాళ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నాలుగు వైపులా బారికేడ్లును పోలీసులు ఏర్పాటు చేశారు.

ట్యాంక్‌బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ మెుత్తంగా 31 క్రేన్లు ఏర్పాటు అయ్యాయి. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగనుంది

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com