భూపాలపల్లిలో బయటపడిన అస్థిపంజరం

Human Skeletons found in Bhupalapally

భూపాలపల్లి జిల్లాలో మూటకట్టిన ఒక అస్థిపంజరం స్థానికంగా చర్చకు కారణం అయ్యింది . భూపాలపల్లి మండలంలోని రాఘవరెడ్డిపేట శివారులో రోడ్డు పక్కన ఒక సంచిలో మూటగట్టిన అస్తిపంజరం అక్కడి రైతులకు కనిపించింది . రోడ్డు పక్కన ఉన్న సంచి వర్షానికి తడవడంతో దానిని కుక్కలు చింపటంతో సంచిలోంచి పుర్రె, చెప్పులు, కాలిఎముకలు బయటకు వచ్చాయి. ఇక అక్కడ అస్థిపంజరం కనుగొన్న రైతులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై అనిల్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకోని విచారణ చేపట్టారు. ఆస్థిపంజరానికి పంచనామా నిర్వహించారు. అతనికి సంబంధించిన ఏమైనా ఆధారాలు దొరకుతాయో అని పరిశీలించారు.మృతుడికి స్వెటర్‌ ఉండటంతో డిసెంబర్, జనవరిలో ఎవరో చంపి సంచిలో మూటగట్టి ఇక్కడ పడేసినట్లుగా పోలీసులు ప్రాధమిక అంచనాకి వచ్చారు . మృతదేహం కుళ్లిపోయి వాసన రాకుండా ఉండేందుకు హంతకులు పాలిథిన్‌ సంచుల్లో కట్టి యూరియా సంచిలో పెట్టి రోడ్డు పక్కన పడేశారని పోలీసులు భావిస్తున్నారు . అయితే 5, 6 నెలల క్రితం సంచి ఇక్కడ లేదని ఎండాకాలంలో ఈ ప్రాంతంలో చెత్తను కాలపెట్టినప్పుడు సంచి కూడా కాలి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి మరీ ఈ సంచి అక్కడికి ఎలా వచ్చింది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే రాఘవరెడ్డిపేటలో అస్తి పంజరం లభించడంతో పోలీసులు అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించారు.గత ఐదారు నెలల కాలంలో ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అన్న కోణంలో ముందు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఒక మిస్సింగ్ కేసు విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరకాల రాజుపేటకు చెందిన తుమ్మల శ్రీకాంత్‌ అనే 18 ఏళ్ళ యువకుడు 5 నెలల నుంచి కనపడటం లేదని ఫిర్యాదు వచ్చిందని పరకాల సీఐ మధు అనుమానంతో సంఘటన స్థలానికి వచ్చారు. శ్రీకాంత్‌కు సంబంధించిన బంధువులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించగా రాత్రి అయినందున అందుబాటులో ఎవరూ లేరని సంఘటన స్థలానికి రాలేదు. శ్రీకాంత్‌కు తెలిసిన మిత్రులు ఫొటో తీసుకుని రాగా శ్రీకాంత్‌ ఫొటోలోని చెప్పులు, చేతిదండ, పాయింట్‌ ఒకే రకంగా ఉన్నాయని అది శ్రీకాంత్ మృతదేహమే అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే ఆ అస్థిపంజరానికి సంబంధించి శ్రీకాంత్‌ సంబంధీకులు ఎవరూ రాకపోవడంతో అస్తి పంజరాన్ని, స్వెటర్, చెప్పులను ప్యాక్‌ చేసి ఎంజీఎం మార్చురీకి తరలించారు పోలీసులు

Jayashankar Bhupallapally latest news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article