HUSBAND RAPED WIFE ALONG WITH FRIEND
కట్టుకున్నవాడే, స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచారం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. నడి రోడ్డు మీదే కాదు నట్టింట్లో కూడా మహిళలకు రక్షణ కరువైంది. భార్య గౌరవం కాపాడుతూ ఆమెకు అండగా ఉండాల్సినే భర్తే స్నేహితుడితో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా కదిరి మండలంలో జరిగిన ఈ ఘటనలో మల్లేశ్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫుల్లుగా మద్యం తాగిన మల్లేశ్ తన స్నేహితుడు కుమార్ ను వెంటబెట్టుకొని ఇంటికొచ్చాడు. భార్యను మంచానికి కట్టేసి మల్లేశ్, కుమార్ అత్యాచారం చేశారు. శరీరంపై గోళ్లతో రక్కి హింసించారు. అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చిన పిల్లలు అచేతనంగా మంచం మీద ఉన్న తల్లికి ఏమైందో అర్థంకాక అంగన్వాడీ టీచర్ కు సమాచారమిచ్చారు. దీంతో భర్త మల్లేశ్ చేసిన దురాగతం బయటకు వచ్చింది. నిందితులు మల్లేశ్, కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.