యువతి అనుమానస్పద మృతి

Hyd Girl Suicide or Murder?

రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి జన చైతన్య వెంచర్ లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద మృతి చెందింది. నిర్మాణంలో వున్న ఏడు అంతస్తుల‌ భవనం పై నుండి కింద పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు. అసలు ఆమె అక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? వంటి వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు? ఆమెతో బాటు ఎవరెవరు వచ్చారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. తనే ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి పైనుంచి కిందికి తోసేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువతి గురించి పూర్తి వివరాలు స్వేకరిస్తున్న పోలీసులు.

Hyderabad Crime News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article