అతిత‌క్కువ‌లో గేటెడ్ క‌మ్యూనిటీలో ఫ్లాట్లు

Spread the love

HYDERABAD AFFORDABLE LUXURY FLATS

హైదరాబాద్లో హ్యాపీ హ్యాపీ గేటెడ్ కమ్యూనిటీ ఉంది తెలుసా? అదెక్కడో కాదు.. కొంపల్లిలో! దాదాపు నాలుగు వందలకు పైగా కుటుంబాలు ఇప్పటికే స్థిర నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో హరిత సూత్రాలకు అనుగుణంగా.. సుమారు ఏడున్నర ఎకరాల్లో బొల్లారం ఎంఎంటీఎస్ స్టేషన్ చేరువలో నిర్మితమవుతున్న అఫర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీయే.. ఆర్క్ హోమ్స్.

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు మూడు ద‌శాబ్దాల అనుభవం గ‌ల ఆర్క్ గ్రూప్‌.. కొంప‌ల్లిలోని బొల్లారం ఎంఎంటీఎస్ రైల్వే స్టేష‌న్ చేరువలో.. ఏడున్న‌ర ఎక‌రాల విస్తీర్ణంలో.. ఆర్క్ హోమ్స్ అనే అఫ‌ర్డ‌బుల్ ల‌గ్జ‌రీ గేటెడ్ క‌మ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే ఇందులోని ప‌లు బ్లాకుల్లో 400కు పైగా కుటుంబాలు ఆనందంగా నివ‌సిస్తున్నాయి. పేరుకు అఫ‌ర్డ‌బుల్ ల‌గ్జ‌రీ గేటెడ్ క‌మ్యూనిటీ అయిన‌ప్ప‌టికీ, ఇందులో ఆధునిక స‌దుపాయాల‌న్నీ పొందుప‌రిచారు. ఈ ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. అటు నాగ్‌పూర్ హై వే ఇటు రాజీవ్ ర‌హ‌దారికి న‌డిమ‌ధ్య‌లో కొలువుదీరింది. బ్యూటీఫుల్ ల్యాండ్ స్కేపింగ్‌తో కంఫ‌ర్ట‌బుల్ గృహాలకు చిరునామాగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది. ఇందులో ఒక స్నేహ‌పూరిత‌మైన వాతావ‌రణం నివ‌సించేవారిని ఇట్టే ఆక‌ట్టుకుంటుంది.

ఆర్క్ హోమ్స్ ప్రాజెక్టును 2020 జూన్‌లోపు పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యాన్ని సంస్థ ఎండీ గుమ్మి రాంరెడ్డి నిర్దేశించుకున్నారు. ఇందులో మొత్తం తొమ్మిది బ్లాకులొస్తాయి. ఇప్ప‌టికే దాదాపు ఏడు బ్లాకులు పూర్త‌య్యాయి. వాటిలో 420 కుటుంబాలు నివ‌సిస్తున్నాయి. మ‌రో రెండు బ్లాకులైన తులిప్‌, ఆర్చిడ్ బ్లాకులను ఈమ‌ధ్యే సంస్థ ప్రారంభించింది. వీటిలో ఒక్కో బ్లాకులో దాదాపు 70 ఫ్లాట్లు వ‌స్తాయి. ప్ర‌తి ఫ్లోరులో కేవ‌లం ప‌ద్నాలుగు ఫ్లాట్లే ఉంటాయి. ఒక్కో ఫ్లాటు ఆరంభ విస్తీర్ణం.. దాదాపు 1075 చ‌ద‌ర‌పు అడుగులు. గ‌రిష్ఠంగా 1510 చ‌ద‌ర‌పు అడుగుల దాకా ఉంటుంది. ధ‌ర విష‌యానికొస్తే.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.3,700 చెబుతున్నారు. అమెనిటీస్ కోసం అద‌నంగా రూ.4 ల‌క్ష‌లు క‌ట్టాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఎనిమిదో బ్లాకులోని నాలుగో అంత‌స్తులో నిర్మాణ ప‌నులు య‌మ‌జోరుగా జ‌రుగుతున్నాయి.ఇ ప్ప‌టికే ఇందులో ఏర్పాటు చేసిన క్ల‌బ్‌హౌస్ స‌దుపాయాల్ని కొనుగోలుదారులు ఆస్వాదిస్తున్నారు.

ఆర్క్ హోమ్స్ ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది క‌రీంన‌గ‌ర్ హై వే నుంచి కేవ‌లం రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ది. అట్లాగే, నిజామాబాద్ హై వే నుంచి మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అంతేకాదు, బొల్లారం ఎంఎంటీఎస్ రైల్వే స్టేష‌న్ కు కేవ‌లం ఐదు నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. ఆర్క్ హోమ్స్ ప్రాజెక్టు నుంచి ఆరు కిలోమీట‌ర్ల రేడియ‌స్‌లో ఏడుకు పైగా ఆస్ప‌త్రులున్నాయి. 15 కిలోమీట‌ర్ల రేడియ‌స్‌లో దాదాపు ఐదు జాతీయ గుర్తింపు పొందిన కాలేజీలు.. రెండు ఐటీ హ‌బ్‌లు 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్నాయి. వీటితో పాటు మూడు కిలోమీట‌ర్ల‌లోపే రిక్రియేష‌న్ స్పోర్ట్స్ కాంప్లెక్సులు, సినీ ప్లెక్స్‌, రిసార్టులు వంటివి ఉన్నాయి. ఐదు ప్ర‌ధాన బ్యాంకులు, ఏటీఎంలు ఆర్క్ హోమ్స్ నుంచి రెండు కిలోమీట‌ర్ల‌లోపే ఉన్నాయి. ఇక రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, డాబాలు, బ్రాండెడ్ సూప‌ర్ మార్కెట్లు స‌మీపంలోనే ఉండ‌టం విశేషం.

ప్ర‌తి కుటుంబం స‌భ్యుడు ఆనందంగా ఆర్క్ హోమ్స్‌లో నివ‌సించ‌డానికి ప్ర‌త్యేకంగా ఆధునిక స‌దుపాయాల్ని ఇక్క‌డి క్ల‌బ్‌హౌజ్‌లో తీర్చిదిద్దారు. స్పేషియ‌స్ స్విమ్మింగ్ పూల్‌, ఆధునిక జిమ్‌, ఇండోర్‌, ఔట్‌డోర్ స్పోర్ట్స్ కోర్ట్స్‌, చిల్డ్ర‌న్స్ ప్లే పార్కు, లైబ్ర‌రీ వంటివి పొందుప‌రిచారు. దీంతో, ఇందులో నివ‌సించేవారు ప్ర‌తి క్ష‌ణాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు. జూన్ 2020 నాటిక‌ల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల‌న్న కృత‌నిశ్చయంతో ఆర్క్ హోమ్స్ ఉన్న‌ది. మ‌రెందుకు ఆల‌స్యం? ఆనంద‌మ‌య‌మైన జీవ‌నాన్ని కోరుకునేవారి కోసం నిర్మిత‌మ‌వుతున్న ఆర్క్ హోమ్స్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుందామా..

hyderabad real estate latest updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *