Hyderabad Bawarchi Hotels were Seized ?
ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చిని జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ను క్లీన్ సిటీ గా ఉంచాలని అధికారులు ఎంత చెప్తున్నా హోటల్ యాజమాన్యం అధికారులు చెప్తున్న నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించటంతో హైదరాబాద్ లో హోటల్స్ తీరుపై అధికారులు అసహనం వ్యక్తం చెయ్యటమే కాకుండా కొరడా ఝుళిపిస్తున్నారు.
హోటల్ నిర్వాహకులు వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టడంలేదని ,తడి, పొడి చెత్తను వేరుచేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ హోటల్‌ను సీజ్ చేశారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్-15 ఏఎంహెచ్‌వో డాక్టర్ హేమలత నేతృత్వంలో అధికారులు, సిబ్బంది కలిసి హోటల్‌ను మూసివేశారు.
గత కొంత కాలం నుంచి హోటల్ నిర్వాహకులకు తడి, పొడి చెత్తను వేరు చేయాలని, ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ యంత్రాన్ని పెట్టుకోవాలని సూచించినప్పటికీ వారు ఇప్పటికీ స్పందించలేదన్నారు. జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా హోటళ్ల నిర్వాహకులు వ్యర్థపదార్థాలను మ్యాన్ హోల్‌లోకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జలమండలి అధికారుల సూచన మేరకు 2016 నుంచి నోటీసులు ఇస్తున్నా వారు పట్టనట్టు ఉండటంతో సీజ్ చేసినట్టు హేమలత వెల్లడించారు.
For more new updates Click Here
Subscribe to TSNEWS.TV