హైదరాబాద్ పావురాలు శ్రీశైలం అడవుల్లో ఎందుకో తెలుసా?

Hyderabad doves in Srisailam forest

పావురాల  ప్రేమికులకు చేదువార్త . నగరంలో అడుగడుగునా దర్శనమిచ్చే పావురాల గుంపులు ఇప్పుడు శ్రీశైలం అడవుల బాట పట్టాయి. నగరంలో విపరీతంగా పెరిగిపోయిన పావురాల సంతతిని గణనీయంగా తగ్గించాలని నగర పాలక సంస్థ నిర్ణయించింది.  అందుకే ఇప్పటికే చాలా పావురాలను శ్రీశైలం అడవుల్లో వదిలేసింది.పావులరాల విసర్జన వల్ల మనుషుల ఆరోగ్చానికి ప్రమాదం పొంచి ఉందని ఇటీవల తేలడంతో నగర పాలక ఉన్నతాదికారులు పావురాల పై దృష్టి సారించారు. పావురాలను ఎవ్వరూ కూడా పెంచుకోరాదని, వాటికి బహిరంగ ప్రాంతాల్లో ఆహారం కూడా వేయొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం కనిపిస్తున్న పావురాల గుంపులు భవిశ్యత్తులో కనిపించవన్న మాట. అంతే కాకుండా పక్షి ప్రేమికులు కొంత మంది హాబీగా కూడా పావురాళ్లను పెంచుకుంటుంటారు. ఇప్పుడిదంతా ఓ జ్ఞాపకంగా మిగిలిపోబోతోంది. కరెంటు తీగలమీద కనువిందుగా వాలిపోయే కపోతాలు కనుమరుగు కాబోతున్నాయి. పావురాల విసర్జన వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని ఓ సర్వేలో తేలడంతో నగర పాలక సంస్ధ అప్రమత్తమైంది.

హైదరాబాద్ లో పెరుగుతున్న పావురాల సంఖ్య ప్రజల ఆరోగ్యానికి సమస్యగా మారిందని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాటి వల్ల మనుషుల్లో శ్వాసకోస వ్యాధులు తలెత్తే అవకాశముందని, వాటికి ఆహారం వేయొద్దని సూచిస్తున్నారు. పావురాల రెట్టలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ఫలితంగా మనుషుల అనారోగ్యానికి గురవుతున్నారని విశ్లేషిస్తున్నారు. పలు బహుళ అంతస్తుల భవనాల్లో వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లు, దుకాణాలు ముఖ్యంగా ఆహార పదార్థాలు అమ్మే వారు వీటికి మేత వేయవద్దని చెపుతున్నారు.ఈ మేరకు నగర పాలక సంస్థ ఓ ప్రకటన చేసింది. నగరంలో ఉన్న హార్టీ కల్చర్ పార్కుల్లో పావురాలకు ఆహారాన్ని వేయటాన్ని జీహెచ్ఎంసీ ఇప్పటికే నిషేధించింది. మరోవైపు మొజాంజాహి మార్కెట్లో పావురాలకు దాణాగా వేసే జొన్నలు, ఇతర తృణ ధాన్యాలను జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పావురాల రెట్టలతో చారిత్రక కట్టడాలు పాడవుతుండడంతో, ఇటీవల మొజాంజాహి మార్కెట్లో 500 పావురాలను పట్టి శ్రీశైలం అడవుల్లో వాటిని విడిచిపెట్టారు. అంచెలంచెలుగా నగరంలో పావురాల సంఖ్యను తగ్గించేందకు కార్యాచరణ రూపొందిస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు

tags : pigeons, hyderabad, srisailam forest, pollution, health problems, ghmc

ఆర్టీసీ సమ్మె పట్టుదలకు పోతే మళ్ళీ మొదటికే..

 నేడు జేఏసీ నేతలతో సర్కార్ చర్చలు ..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *