హెల్త్ కేర్ సర్వీసెస్ హబ్ గా హైదరాబాద్ 

HYDERABAD HEALTH CARE SERVICES HUB
* తన కార్యకలాపాలకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్న ప్రపంచ _రెండవ అతిపెద్ద హెల్త్‌కేర్ సేవల సంస్థ
* anthem ప్రపంచ రెండవ అతిపెద్ద హెల్త్‌కేర్ సేవల సంస్థ
* అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ భారతదేశంలో తన _కార్యకలాపాలకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది
* కంపెనీ కార్యకలాపాల ద్వారా సుమారు రెండు వేల నూతన ఉద్యోగాలు
* రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు కొనసాగించనున్న కంపెనీ
* భారతదేశ హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీల హబ్ గా హైదరాబాద్ మారుతుందన్న మంత్రి కేటీఆర్
ఇప్పటికే ఐటీ మరియు ఐటీ అనుబంధ రంగాల్లో అనేక నూతన పెట్టుబడులతో దూసుకెళ్తున్న హైదరాబాద్ నగరం, హెల్త్ కేర్ సర్వీసెస్ సెక్టార్ లోనూ అనేక కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది. గత సంవత్సర కాలంగా అనేక నూతన కంపెనీల పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాలతో భారతదేశ హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీల హబ్ గా హైదరాబాద్ మారుతుంది. తాజాగా ప్రపంచ రెండవ అతిపెద్ద హెల్త్ కేర్ సేవల సంస్థ అయిన anthem కంపెనీ హైదరాబాద్ ను తన కార్యకలాపాల కోసం ఎంచుకున్నది. 90 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం కలిగిన కంపెనీ హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. అమెరికాలోని ఇండియానా పోలీస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే anthem  సంస్థ హైదరాబాద్ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టనుంది. తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా సుమారు రెండు వేల మంది నూతన ఉద్యోగాలు కల్పించేందుకు వీలు కలుగుతుంది.
* కంపెనీ కార్యకలాపాల విస్తరణకు ఇక్కడ అందుబాటులో ఉన్న అత్యుత్తమ మానవ వనరులే హైదరాబాద్ నగరాన్ని ఎంచుకునేందుకు ఒక ప్రధాన కారణంగా Anthem కంపెనీ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి రంగాల్లో అనుసరిస్తున్న వినూత్నమైన పాలసీలు మరియు ఐటి మరియు ఐటి అనుబంధ సేవల రంగాల్లో అభివృద్ధి వంటి అంశాలు తాము హైదరాబాద్ నగరాన్ని ఎంచుకునేందుకు దోహదం చేశాయని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. ఇప్పటికే భారీ ఐటి పెట్టుబడులకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరం హెల్త్ కేర్ సర్వీసెస్ రంగంలోనూ వేగంగా అభివృద్ధి సాధిస్తూ వస్తున్నది.  ప్రపంచ అతిపెద్ద హెల్త్ కేర్ సర్వీసెస్ సంస్థ అయిన యునైటెడ్ హెల్త్ కేర్ గ్రూప్ కు  భారతదేశంలోనే అతిపెద్ద ఉనికి హైదరాబాద్ నగరంలోనే ఉన్నది. గత నాలుగేళ్లలో యునైటెడ్ హెల్త్ కేర్ గ్రూప్ సుమారు 8 లక్షల 30 వేల చదరపు అడుగుల ఫెసిలిటీ తో తన కార్యకలాపాలను విస్తరిస్తూ వస్తున్నది.
* హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీలకు హబ్‌గా హైదరాబాద్ మారడం ప్రతి మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. Anthem కంపెనీ తన కార్యకలాపాలకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం పట్ల ఆయన కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ కార్యకలాపాల ద్వారా నూతనంగా రెండువేల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు మరిన్ని పరోక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. కంపెనీ విస్తరణ కోసం అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం వైపు నుంచి అందిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీకి అవసరమైన మానవ వనరులను అందించేందుకు అవసరమైతే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ( టాస్క్) ద్వారా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article