డైనమిక్ సిటీ గా గ్లోబల్ ర్యాంకింగ్ లో 2వ హైదరాబాద్

Hyderabad is in 2nd Global ranking and dynamic city

తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ కు అరుదైన గౌరవం దక్కింది. భాగ్యనగరి సిగలో మరో మణిహారం చేరింది. ఇప్పటికే బోలెడన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు , రివార్డులు సొంతం చేసుకున్న భాగ్యనగరి మరోమారు తన సత్తా చాటుకుంది. తన ప్రత్యేకతతో హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో మోస్ట్ డైనమిక్ సిటీగా టాప్ సెకండ్ ర్యాంకులో నిలిచింది. ప్రపంచంలోని టాప్ 20 డైనమిక్ సిటీలలో బెంగళూరు టాప్ ర్యాంకులో నిలవగా.. హైదరాబాద్ నగరానికి రెండో స్థానంలో చోటు దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షికోత్సవ సమావేశంలో భాగంగా గ్లోబల్ ర్యాకింగ్స్ కు సంబంధించిన నివేదికను ప్రచురించింది.ఆర్థికంగా , వాణిజ్యం , రియల్ ఎస్టేల్ వంటి పలు రంగాల అభివృద్ధిని పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను రూపొందించినట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక తెలిపింది. హైదరాబాద్ నగరం అభివృద్ధికి బాటలు వేయడంలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషించింది. అందుకే హైదరాబాద్ సీఎంఐ టాప్ ర్యాంకులో నిలవడానికి ఇదొక కారణంగా చెప్పవచ్చు. ఇటీవల 12 నెలలకు గాను నైట్ ఫ్రాంక్ గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్-2018 విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కూడా టాప్ ఐదు సిటీల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది.
డబ్ల్యూఈఎఫ్ రిఫోర్ట్ ప్రకారం.. సార్ట్ టెర్మ్ లో అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ చోటు దక్కించుకుంది. జేఎల్ ఎల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్ (సీఎంఐ-2019)వార్షికోత్సవం సందర్భంగా టాప్ డైనమిక్ సిటీల జాబితాను విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన 131 మేజర్ సిటీలతో పాటు క్రమంగా విస్తరిస్తున్న నగరాల జాబితాను సీఎంఐ-2019 ర్యాంకుల్లో వెల్లడించారు. ఆసియా పసిఫిక్ రీజియన్ జేఎల్ ఎల్ సీఎంఐ 2015 ర్యాంకింగ్ జాబితాలో టాప్ 34 సిటీలలో కనీసం టాప్ 20 సిటీల్లో కూడా హైదరాబాద్ చోటు దక్కించుకోలేకపోయింది. 2017లో ఐదో స్థానంలో హైదరాబాద్.. 2018 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ర్యాంకింగ్స్ లో మాత్రం టాప్ ర్యాంకులో బెంగళూరు సిటీ చోటు దక్కించుకుంది. గత ఏడాదిలో రెండో ర్యాంకులో ఉన్న బెంగళూరు ఈసారి టాప్ ర్యాంకును సాధించింది. టాప్ 20 డైనమిక్ నగరాల్లో రెండో స్థానంలో హైదరాబాద్ ఉండగా.. మరో ఐదు నగరాలు బెంగళూరు (1) ఢిల్లీ (4) పుణె (5) చెన్నై (7) కోల్ కతా (15) ర్యాంకుల్లో నిలిచాయి.
గత ఏడాది నుంచి సిటీ మూమెంటమ్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ,పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ,క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ వంటి పలు రంగాల అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ముఖ్యంగా స్టార్టప్ రంగాలైన ఈజీ డూయింగ్ బిజినెస్ లకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ నగరం మరింత అడ్వాన్స్ గా దూసుకెళ్తున్న క్రమంలో మెట్రోలతో పాటు వివిధ సైంటిఫిక్ సంస్థలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఈ ఏడాది సీఎంఐ ఆరో వెర్షన్ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ ర్యాంకు క్రమేణా పెరిగిపోతుంది

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article