మన మెట్రోలో పెప్పర్ స్ప్రే అనుమతి

Hyderabad Metro Allowed Pepper Spray

మహిళలపై అత్యాచార ఘటనల నేపధ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రే అనుమతిస్తూ మెట్రో బుధవారం నిర్ణయం తీసుకున్నది. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు మానవ మృగాల  చేతుల్లో దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ ఉదంతం తో పలు రాష్ట్రాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లడానికి మహిళలకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని బీఎంఆర్సీఎల్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి బీఎల్ యశ్వంత్ చవాన్ వెల్లడించారు. వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం అనంతరం.. మహిళా ప్రయాణికుల భద్రతపై తాము దృష్టి సారించాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో, హైదరాబాద్ మెట్రో అధికారులు పెప్పర్ స్ప్రే ను అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.

మహిళా ప్రయాణికులు స్వీయ రక్షణ కోసం వాటిని వినియోగించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటిదాకా పెప్పర్ స్ప్రే తీసుకెళ్లడంపై నిషేధం ఉండేదని, వాటిని తీసుకెళ్లే మహిళా ప్రయాణికులను రైలు ఎక్కడాన్ని నిరోధించేలా చర్యలు తీసుకునే వాళ్లమని చెప్పారు. డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఘటన చోటు చేసుకున్న తరువాత నిబంధనలను సడలించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు యశ్వంత్ చవాన్ తెలిపారు. మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశిస్తూ.. బెంగళూరులోని అన్ని మెట్రో స్టేషన్లకు సమాచారాన్ని పంపించినట్లు చెప్పారు. పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లే మహిళా ప్రయాణికులను అడ్డుకోవద్దని మెట్రో స్టేషన్ల భద్రతా సిబ్బందికి సూచనలు పంపామని అన్నారు. బెంగళూరు మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్న తర్వాత కానీ మన మెట్రో అధికారులు కళ్లు తెరకపోవడం విడ్డూరం. నిజానికి, హైదరాబాద్ మెట్రో ప్రయాణీకుల రక్షణ కోసం పటిష్ఠమైన చర్యల్ని తీసుకోవడం లేదని కొందరు ప్రయాణీకులు నేటికీ భావిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో అధికారుల తాజా నిర్ణయాన్ని మహిళా లోకం స్వాగతిస్తోంది.

Hyderabad Metro Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *