హైదరాబాద్ ఇజ్జత్ తీసేసిన ఎల్ అండ్ టీ, మెట్రో

117
Hyderabad Metro Builted With Inferior Quality 
hyderabad metro travelled in wrong route?

Hyderabad Metro Builted With Inferior Quality

ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రోలు కలిసికట్టుగా హైదరాబాద్ ఇజ్జత్ తీసేశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసేశాయి. పెచ్చూలూడి పడి ఒక మహిళ చనిపోయిందంటే, ఆ స్టేషన్ల నాణ్యత ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు భారతదేశంలో ఇలాంటి మెట్రో ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేవు. నిజానికి, అమీర్ పేట మెట్రో స్టేషన్ లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అంతే కాకుండా మెట్రో నాణ్యతా లోపాలను ఒక్కసారిగా ప్రపంచానికి చాటి చెప్పింది. సుమారు వంద సంవత్సరాలు మన్నికగా ఉండే విధంగా నిర్మించామని చెప్పుకున్న ఎల్ ఆండ్ టీ నిర్మాణ సంస్థ పచ్చి అవాస్తవాలు చెప్పినట్టు రుజువైంది. హైదరాబాద్ లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి తడవకుండా మెట్రో స్టేషన్ కింద నిలబడ్డ ఓ యువతి మీద మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆశ్యర్యానికి గురిచేసింది. మెట్రో నిర్మాణం ఇంత నాసి రకండా జరిగిందా అంటూ నగర వాసులు భయ భ్రాంతులకు గురౌతున్నారు.

హైదరాబాద్ ఇజ్జత్ పోయింది
హైదరాబాద్ మెట్రోకి రైల్ కు ఎంతో ఘన చరిత్ర ఉంది. కానీ ఇలాంటి ఘటనలు మెట్రో ఘన చరిత్రను అభాసుపాలు చేస్తున్నాయి.నగరంలోని అమీర్‌పేట, మైత్రివనం మెట్రో స్టేషన్‌ కింద ఆదివారం సాయంత్రం దారుణమైన ప్రమాదం చోటు చేసుకుని మెట్రో స్టేషన్‌ పైనుంచి పెచ్చులు ఊడిపడి ఓ యువతి మృతి చెందింది. మృతురాలు కేపీహెచ్‌బీ కి చెందిన ఇరవై నాలుగేళ్ల మౌనిక గా గుర్తించారు. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న మౌనిక రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్నట్లు తెలిసింది. భారీ వర్షం కురుస్తుండటంతో మౌనిక మెట్రో స్టేషన్‌ మెట్ల కింద నిలబడి ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి ఆ పెచ్చు నేరుగా తలమీద పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందింది. ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.మరోవైపు ఈ సంఘటనపై మెట్రో యాజమాన్యం వివరణ ఇచ్చింది. యువతి తలపై పైనుంచి పదునైన పెచ్చులు ఊడి పడడంతో ఆమె తలకు బలమైన గాయమైందని, వెంటనే సమీప ఆస్పత్రికి తరలించామని తెలిపింది. కానీ అప్పటికే మౌనిక మృతి చెందిందని తెలిపారు. ఈ దుర్ఘటనతో పాటు నాంపల్లి గాంధీ భవన్ వద్ద మెట్రో రైలు లోకో పైలట్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణీకులు ఎగిరి పడ్డారు. వెంట వెంటనే 2 సార్లు సడన్ బ్రేక్ వేయడంతో ఏం జరిగిందోనంటూ ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి ఇదే చివరి స్టేషన్ అంటూ తప్పుడు అనౌన్స్‌మెంట్ చేశారు. మెట్రో రైల్ సిబ్బంది చేస్తున్న తప్పులకు ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక మెట్రో స్టేషన్ పెచ్చులూడడం, దానికి ఓ మహిళ బలవ్వడం, మెట్రో నిర్మాణంలోని డొల్లతనాన్ని చెప్పకనే చెప్తుంది.

తెలంగాణ ఆడపడుచులూ.. బతుకమ్మ చీరెలు వచ్చేశాయి..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here