ఇదేనా.. మెట్రో ట్రైనులో ప్రయాణీకుల భద్రత?

68
hyderabad metro rail security utter flop
hyderabad metro rail security utter flop

hyderabad metro rail security utter flop

ఈ నెల 8 వ తేదీన మెట్రో రైలులో తాగి హల్చల్ చేసిన వ్యక్తిని  మెట్రో సెక్యూరిటీ పట్టుకున్నారు. అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆ రోజు మెట్రో రైలులో తాగిన మత్తులో ప్రయాణీకులను భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తి సీలం కనకరాజు గా గుర్తించారు.  సీసీటీవీ ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ తో గుర్తించినట్లు సమాచారం. మెట్రో లో డాన్స్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ కనకరాజు హల్ చల్ చేశారు. అయితే, ఈ సంఘటన వల్ల మెట్రో రైలులో ఎలాంటి భద్రత లేదనే విషయం అర్థమవుతుందని ప్రయాణీకులు అంటున్నారు. నిజానికి, మెట్రో స్టేషన్ లోకి ప్రవేశించి, టికెట్ తీసుకోవడం, చెక్ చేయడం, మెట్రో రైలు ఎక్కేటప్పుడు గార్డు ఉండటం వంటి సంగతులు తెలిసిందే. మరి, ఒక వ్యక్తి అంతలా తాగి మెట్రో రైలులోకి ఇంతమందిని దాటి ఎలా ముందుకొచ్చాడు? అంటే, అతను తాగాడని తెలిసినా మెట్రో రైలులోకి అనుమతించారా? ఇలాగైతే భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మెట్రో రైలులో అంత మంది ప్రయాణీకులను భయబ్రాంతులకు గురి చేసిన తర్వాత.. అతను తుళ్లుతూ బయటికొచ్చే వరకూ అక్కడి గార్డులు చోద్యం చూస్తున్నారా? అని అడుగుతున్నారు. సెప్టెంబరు 8న సంఘటన జరిగితే, 21 తేదిన అరెస్టు చేస్తున్నారంటే.. మెట్రో సెక్యూరిటీ డొల్లతనం గుర్తుకొస్తుంది. అసలు సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉండాలంటే.. ఒక వ్యక్తి ఒక స్టేషన్లో గొడవ చేేస్తున్నాడని తెలియగానే.. తక్షణమే తదుపరి స్టేషన్లో అతన్ని అదుపులోకి తీసుకోవాలి. అంత అప్రమత్తంగా మెట్రో సెక్యూరిటీ ఉండాలి. ఇందుకు స్థానిక పోలీసులు సహకరించాలి. అంతే తప్ప, దొంగలు పడ్డ ఆరు నెలల తర్వాత పట్టుకుంటే.. మెట్రో ట్రైనుకు సాధారణ ట్రైను మధ్య పెద్దగా తేడా ఉండదు. పైగా, ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రజలు మెట్రోలోకి అడుగుపెట్టడానికి భయపడతారు.

hyderabad metro updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here