ప్రాణాలు తీస్తున్నసిటీ నాలాలు

48
Hyderabad Open drainage is worst
Hyderabad Open drainage is worst

Hyderabad Open drainage is worst

బెస్ట్ లివింగ్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి. కానీ చిన్న చిన్న సమస్యలు నేటికీ సిటీ జనాన్ని భయపెడుతున్నాయి. రోడ్లపై గుంతలు, డ్రైనేజీ వ్యవస్థ, నాలాల నిర్వహణ తీరు ఘోరంగా తయారైంది. ముఖ్యంగా నాలాల నిర్వహణ తీరు ఎక్కడ వేసిన అక్కడే అన్న చందంగా మారింది. నాలాల విస్తరణలు జరగకపోవడం కారణంగా రోడ్లు చెరువులుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయి. సిటీలోని చాలా నాలాలు విస్తరించకపోవడం, వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంతా జరుగుతున్న అధికారులు, నాయకులు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రజల ప్రాణాలు నాలాల్లో కలుస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్ నేరడుమెట్ ఠాణాకు చెందిన చిన్నారి సుమేధా (12) సైకిల్ తొక్కడానికి బయటకు వెళ్లింది. ఆడుకోవడానికి వెళ్లిన అమ్మాయి ఇంటికి రాలేదు. 12 గంటల తర్వాత చిన్నారి సుమేధను వెతకడంతో నాలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బండ చెరువులో శవమై కనిపించింది. చిన్నారి మరణానికి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే కారణమని సిటీ జనాలు అంటున్నారు. వర్షకాలంలో నాలాల సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు ఏమి పట్టనట్టుగా ఉన్నారు. ఇప్పటికైనా నాలాల విస్తరణ చేపట్టాలని, వాటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here