ఫార్మాసిటీ భవిష్యత్తులో బలోపేతం

29
Hyderabad Pharma City Will Rise 
Hyderabad Pharma City Will Rise 

Hyderabad Pharma City Will Rise

ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాధాన్యం, అవసరం మరింతగా పెరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికీ హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మా లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకున్నాదని తెలిపిన మంత్రి కేటీఆర్ భవిష్యత్తులో ఫార్మా సిటీ ఫార్మా రంగంలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ పటంలో ప్రత్యేకంగా నిలుపుతుంది అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కరోనా కి అవసరమైన మందు తో పాటు వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రణాళికలు వేగంగా రూపొందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఫార్మాసిటీ ద్వారా ఇలాంటి అనేక సమస్యలకు, వ్యాధులకి సమాధానం ఇక్కడి నుంచి వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికాకు చెందిన యూఎస్ఎఫ్డీఏ నుంచి వరుసగా అత్యధిక అనుమతులు పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ గా నిల్వబోతున్న హైదరాబాద్ ఫార్మా సిటీ జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ఉండబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా అనుగుణంగా ఫార్మాసిటీ రూపొందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తమ శాఖ పని చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫార్మాసిటీ ప్రమాణాలతో పాటు ప్రాధాన్యతలను నిర్ణయించుకున్నట్లు మంత్రి కేటీఆర్ ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో తెలిపారు. పరిశ్రమల శాఖ, టి ఎస్ ఐఐ సి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన ఫార్మాసిటీ సమీక్ష సమావేశం ఈరోజు ప్రగతి భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫార్మాసిటీ పనుల పురోగతి పైన మంత్రి కేటీఆర్ సమీక్షించారు. రానున్న కొద్ది నెలల్లోనే హైదరాబాద్ ఫార్మా సిటీ మొదటి దశ ప్రారంభం అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. ఫార్మాసిటీ కి కావాల్సిన రోడ్లు మరియు ఇతర మౌలిక వసతులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్న తీరు పైన మంత్రి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వల్పకాలికంగా సంవత్సరం నుంచి మొదలుకొని వచ్చే ఐదు సంవత్సరాల పాటు ఏయే సంవత్సరం, ఏయే కార్యక్రమాలు చేపడతారు, ఎలాంటి పురోగతి ఫార్మాసిటీ సాధించబోతున్నాదో తెలిపే టైం లైన్ లతో కూడిన ఒక నివేదికను తనకు సమర్పించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ ఫార్మా సిటీ ఫార్మా ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలను మొదలుకొని అందులో పనిచేసే కార్మికులకు అవసరమైన నివాస సౌకర్యాల వరకు అన్ని అందులోనే ఉండే ఒక స్వయం సమృద్ధి కలిగిన టౌన్షిప్ గా ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఫార్మా సిటీ లో కేవలం ఉత్పత్తుల తయారీ మాత్రమే కాకుండా ఫార్మా పరిశోధన మరియు అభివృద్ధి సౌకర్యాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ, సాధ్యమైనంత ఎక్కువగా గ్రీన్ కవర్ వంటి ప్రత్యేకతలు ఫార్మాసిటీలో ఉండబోతున్నాయన్నారు.

 

Pharma City Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here