ఇదేనా విశ్వనగరం : చెరువులను తలపిస్తున్న సిటీ రోడ్లు, వీధులు

Hyderabad roads, streets damaged

‘హైదరాబాద్ సిటీని ప్రపంచ పటంలో ముందుంచుతాం. విశ్వనగరంగా తీర్చి దిద్ది బెస్ట్ లివింగ్ సిటీగా మారుస్తాం’ మన నాయకులు, అధికారులు తరగాచు చెప్పే మాటలివి. విశ్వనగరం మాట అలా ఉంచితే… చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. కార్లు, బైక్లు వర్షపు నీళ్లలో తెలియడుతున్నాయి. వీధులన్నీ జల దిగ్భందలో చిక్కుకుపోతున్నాయి. దీంతో సిటీ ప్రజలను ముప్పుతిప్పలు పడుతున్నాయ. చిన్న పాటి వర్షానికే ఇలా జరిగితే.. ఎడితెరిపి లేని వర్షం కురిస్తే హైదరాబాద్ ఆగం కావాల్సిందేనా? ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన డ్రైనేజీ, నాలాల వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణంగా మండిపడుతున్నారు. కేవలం పది సెంటీమీటర్ల వానకే పరేషాన్ కావాల్సి వస్తందంటున్నారు. రోడ్లపై గుంతలు పడి పలు ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. స్మార్ట్ సిటీ పక్కనపెట్టి, కనీసం ఉండటానికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఒకవైపు జనాలు కరోనా వైరస్ భయంతో ఉంటే మరో పక్క తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లోని పలు పాంత్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కోమరంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, వికారాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వర్షభావం ఎక్కువగా ఉంది. వానలు బాగా కురవడంతో గ్రామాల్లో వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే జనాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *