Wednesday, December 4, 2024

హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు

తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా ఈ ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7.27 గంటలకు అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ భూమి కొన్ని సెకన్లపాటు కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. దీని కేంద్రం ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించారు. దీని ప్రభావం మాత్రం 225 కిలోమీటర్ల మేర విస్తరించింది.
హైదరాబాద్‌ పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాలతోపాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలోనూ ప్రకంపనలు కనిపించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్టు తెలిసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular