జలవిద్యుత్ కేంద్రం ప్రిజర్వ్ టన్నెల్స్ తవ్వకం

183
Hydropower Station Preserve Tunnels
Hydropower Station Preserve Tunnels

పోలవరం బహుళార్దక సాధక ప్రాజెక్టులో అత్యంతకీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులు వేగవంతం చేసింది ఎపి ప్రభుత్వం. అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ పూర్తి చేసేలా పక్కాప్రణాళికతో పోలవరం ప్రాజెక్టు ఫలితాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు వడివడిగా అడుగులేస్తోంది ప్రభుత్వం.

ప్రతి ఏడాది గోదావరి నది నుంచి మూడు వేల టీ ఎం సి ల నీరు సముద్రంలో కలుస్తుంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగించే నీటికన్నా చాలా రేట్లు ఎక్కువ. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ తో పాటు జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని తలపెట్టింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే 194 టి ఎం సి ల నీటిని నిల్వ చేస్తారు. ఇందులో 120 టి ఎం సి ల నీటిని జల విద్యుత్ ఉత్పత్తి , సాగు నీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన 70 టి ఎం సి లని నిల్వ చేస్తారు. ఈ 120 టి ఎం సి ల నీటిని గోదావరి నదీ పరివాహక ప్రాంతం లో ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి,కృష్ణా జిల్లాల ప్రజల సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగించవచ్చు.

పోలవరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల కింద 10. 5 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది. దీన్ని స్థిరీకరించేందుకు పోలవరం జల వ్రిద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్కు వాడే నీటిని ఉపయోగిస్తారు. గోదావరి నీటిని నిల్వ చేసే అవకాశాలు ఆంధ్ర ప్రదేశ్ లో ఒక పోలవరం ప్రాజెక్ట్ వద్ద తప్ప మరెక్కడా లేవు. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద నిల్వ అవకాశాలు ఉన్నా అది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో పోలవరం వద్ద నీటిని నిల్వ చేసి పలు ప్రయోజనాలకు ఈ నీటిని వినియోగించనున్నారు. అందులో ఈ జల విద్యుత్ కేంద్రం ఒకటి. గోదావరి నదిపై ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా భారీ జల విద్యుత్ కేంద్రాలు లేవు. వున్న ఒకటి, రెండు కూడా చాలా తక్కువ సామర్ధ్యం తో ఉన్నాయి. . పోలవరం లో ఉత్పత్తి చేసే విద్యుత్ వల్ల రాష్ట్రం మిగులు సాధించే అవకాశం ఉంది. దీన్ని మన రాష్ట్ర అవసరాలు పోను విక్రయిస్తే ఆదాయం వస్తుంది. అదే సమయంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అంతకంటే ప్రధానంగా వ్యవసాయానికి ఏంతో మేలు జరగనుంది.

జలవిద్యుత్ కేంద్రం ప్రత్యేకతలు ;

పోలవరం జలవిద్యుత్ కేంద్రం 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ సామర్ద్యంతో నిర్మిస్తున్నారు.ఇందులో 12వెర్టికల్ కెప్లాన్ టర్బైన్లు ఉంటాయి,ఒక్కో టర్బైన్80మెగావాట్ల కెపాసిటీ ఉంటుంది.వీటిని భోపాల్ కు చెందిన బీహెచ్ ఈ ఎల్ సంస్థ రూపిందించింది.ఇవి ఆసియాలోనే అతిపెద్దవి.వీటికి సంబంధించి ఇప్పటికే మోడల్ టెస్టింగ్ కుడాపూర్తి అయింది. వీటికోసం 12 ప్రిజర్ టన్నెల్స్ తవ్వాల్సి ఉంటుంది. ఒక్కో టన్నెల్ 145మీటర్లు పొడవున,9మీటర్లు డయాతో తవ్వుతారు. వీటికి 12 జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్లు ఉంటాయి,ఒక్కోటి 100మెగావాట్లు సామర్ద్యం తో ఉంటాయి.పవర్ ప్రాజెక్టు కోసం 206మీటర్లు పొడవున అప్రోచ్ ఛానెల్, 294మీ వెడల్పు తవ్వాల్సి ఉంటుంది.అదేవిధంగా జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి డ్రాయింగ్స్,మోడల్స్ రూపొందించే పనులు సైతం పూర్తి కావొచ్చాయి.

పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి.అందులో భాగంగానే ఈరోజు అత్యంత కీలకమైన ప్రిజర్వ్ టన్నెల్స్ తవ్వకం పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు జెన్కో అధికారులు.కీలకమైన జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ రివర్స్ టెండరింగ్ తరువాత 30.03.2021న పనులు ప్రారంభించింది.ఇప్పటికే కొండ 18.90 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులను పూర్తి చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులలో జలవనరుల శాఖ తవ్వకం పనులను పర్యవేక్షిస్తుండగా,కీలకమైన ప్రిజర్వ్ టన్నెల్స్ తవ్వకం పనులు మరియు జలవిద్యుత్ కేంద్రానికి సంబందించిన మిగిలిన అన్నిపనులను జెన్కో అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు అనుకన్నసమయానికే పూర్తి చేసి ప్రాజెక్టు ఫలాలను రాష్ట్రప్రజలకు అందించేందుకు ప్రభుత్వ సహాకారంతో పనులను వేగవంతం చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.

ఈ కార్యక్రమంలో జెన్కో ఎస్ ఈ-ఎస్.శేషారెడ్డి,ఈఈ లు ఎ. సోమయ్య,సి.హనుమ,ఎలక్ట్రికల్ ఈఈ వై.భీమధన రావు,జలవనరుల శాఖ ఈఈ పాండురంగారావు,మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్,జీఎం ముద్దు కృష్ణ,ఎజిఎం క్రాంతి కుమార్,కోఆర్డినేటర్ ఠాగూర్ చంద్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి టన్నెల్స్ తవ్వకం పనులు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here