HYUNDAI CLOSED CAR PLANT
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతున్న కరోనా ఇప్పటికే 3 వేల మంది ప్రాణాలు తీసింది. చైనా నుంచి ఇప్పటికే 57 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్83,880కి పైగా సోకింది .. ఇక, తమ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడికి కరోనా వైరస్ సోకడంతో.. దక్షిణ కొరియాలోని తన ఫ్యాక్టరీలోని మూసివేసింది ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్.. కార్మికుడికి కరోనా పాజిటివ్ తేలడంతో.. ఉల్ఫాన్లోని ఉత్పాదక యూనిట్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది హ్యుండాయ్. మరోవైపు, కరోనా వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా ఉండగా.. ఈ కంపెనీ షేర్లు దాదాపు ఐదు శాతం మేర పడిపోయాయి. చైనా తర్వాత అత్యధిక మంది కరోనా వైరస్ బారినపడిన రెండో దేశం దక్షిణ కొరియానే.. దీంతో రెండు అతిపెద్ద కంపెనీలైన ఎలక్ట్రానిక్ మేజర్ శామ్సంగ్, ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హ్యుండాయ్.. ఉల్సాన్లో ఐదు కారు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. వీటిలో మొత్తం ఏటా 14 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. హ్యుండాయ్ ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేసే వాహనాల్లో 30శాతం ఇక్కడే తయారవుతాయి. ఇక్కడ మొత్తం 34వేల మంది ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు కరోనా భయంతో ఉల్ఫాన్లోని ఫ్యాక్టీరీని మూసివేసింది యాజమాన్యం.
tags: #Coronavirus, #CoronavirusUpdate, #CoronavirusinIndia, #Coronavirusinchina, #Wuhancoronavirus, Southkorea, #hyundai factory shutdown, #hyundaiworker corona positive