ఆమ్రపాలికి ప్రమోషన్

38
IAS amprali get promotion
IAS amprali get promotion

IAS amrapali get promotion

యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కీలక పదవి దక్కింది. 2010  ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి కాటా  ఆమ్రపాలి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. 2023 అక్టోబర్‌ 7 వరకు ఆమె ఈ పదవిలో ఉంటారు. ప్రధానమంత్రి కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు డిప్యూటీ సెక్రటరీలలో ఆమ్రపాలికి కూడా స్థానం దక్కింది. ఈ మేరకు అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది.

పాలనలో తనదైన ముద్ర వేసిన ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, వరంగల్‌ కలెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె, తాజాగా ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here