రాయుడి బౌలింగ్ కు ఐసీసీ నో

ICC BAN ON RAYUDU

  • బౌలింగ్ టెస్ట్ కు రాకపోవడంతో ఐసీసీ నిర్ణయం

టీమిండియా ఆటగాడు అంబటి రాయుడి బౌలింగ్ పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) నిషేధం విధించింది. అంతర్జాతీయ మ్యాచ్ లలో రాయుడు బౌలింగ్‌ చేయకూడదని స్పష్టంచేసింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో రాయుడు ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ పై ఐసీసీ అనుమానం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. దీంతో రాయుడు బౌలింగ్ యాక్షన్ ను పరిశీలించేందుకు అతడు 14 రోజుల్లోగా పరీక్షకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. అయితే ఈ పరీక్షకు రాయుడు హాజరుకాకపోవడంతో నిబంధనల మేరకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రాయుడు బౌలింగ్‌ చేయడంపై నిషేధం విధించామని.. దేశవాళీ, బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీల్లో మాత్రం చేయవచ్చని పేర్కొంది. జనవరి 13లోగా రాయుడు బౌలింగ్‌ పరీక్షకు హాజరు కావాల్సింది. కానీ న్యూజిలాండ్‌ పర్యటనతో బీజీగా ఉన్నందున ఐసీసీ నిర్దేశించిన పరీక్షకు అతడు హాజరు కాలేదు. దీంతో క్లాజ్‌ 4.2 నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేయకుండా రాయుడిపై నిషేధం విధించింది. రాయుడు బౌలింగ్ పరీక్షకు హాజరై తన బౌలింగ్‌ యాక‌్షన్‌ సరైనదేనని నిరూపించుకునే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.

SPORTS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article