ICC Doubt on Rayadu Bowling
- 14 రోజుల్లో పరీక్షలకు హాజరుకావాలని సూచన
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు బౌలింగ్ యాక్షన్ పై ఐసీసీ సందేహం వ్యక్తంచేసింది. రాయుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. అందువల్ల అతడి బౌలింగ్ శైలి సరిగా ఉందో లేదో నిర్దారించేందుకు 14 రోజుల్లో పరీక్షలకు హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు భారత జట్టు మేనేజ్ మెంట్ కు నివేదిక అందజేసింది. శనివారం సిడ్నీలో జరిగిన తొలి వన్డే అనంతరం మ్యాచ్ అధికారులు రాయుడు ఆఫ్‌స్పిన్ బౌలింగ్ యాక్షన్‌ను తప్పు పట్టారు. ఈ నేపథ్యంలోనే అతడి బౌలింగ్ శైలిని పరీక్షించాలని నిర్ణయించారు. అయితే, ఈ పరీక్షల్లో తుది ఫలితం వచ్చే వరకు మాత్రం రాయుడు తన బౌలింగ్‌ను కొనసాగించవచ్చు.