హంగ్ తప్పదా?

IF ELECTIONS CAME, HUNG MAY FORM

  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితం అదే
  • మేజిక్ ఫిగర్ కు 35 సీట్ల దూరంలో ఎన్డీఏ
  • ఎన్డీఏకి 237, యూపీఏకి 166 సీట్లు, ఇతరులకు 140
  • ఇండియాటుడే-కార్వీ ఇన్ సైట్స్ సర్వేలో వెల్లడి

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న సమయంలో మరో సర్వే వచ్చింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే హంగ్‌ ఏర్పడుతుందని తేలింది. ‘మూడ్ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’ పేరుతో ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్‌ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఏకంగా 99 సీట్లు తగ్గిపోతాయని సర్వే అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 237 సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడైంది. దీంతో మేజిక్ ఫిగర్ 272 కంటే ఆ కూటమికి 35 సీట్లు తగ్గనున్నాయి. ఇక యూపీఏకి 2014 కంటే 106 సీట్లు అధికంగా రావడంతో దాని బలం 166కి చేరుతుందని, ఇతరులకి 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఓట్లపరంగా చూస్తే యూపీఏ కంటే ఎన్డీఏకి ఎక్కువ ఓట్లు వస్తాయి. ఎన్డీఏ 35 శాతం, యూపీఏ 33 శాతం ఓట్లు రానున్నాయి. గత ఎన్నికల్లో సొంతంగానే 282 స్థానాలు గెలుచుకుని మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఈసారి హంగ్ పార్లమెంట్ ఏర్పడుతందనే అంచనాల నేపథ్యంలో ఏమి చేస్తుందనే అంశంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎవరికీ ఆధిక్యం దక్కని పరిస్థితే ఏర్పడితే ఇతర పార్టీలే కీలకం కానున్నాయి. వారిలో ఎక్కువ మంది ఎవరి వైపు మొగ్గు చూపితే ఆ కూటమి అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ సర్వే జరిగినప్పటికి, ఇప్పటికి కొంచెం మార్పులు వచ్చాయని, తాజాగా కేంద్రం ప్రకటించిన ఈబీసీ కోటా బీజేపీకి లబ్ధి కలిగిస్తుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ రైతు చుట్టూ తిరుగుతున్నాయని, వారికి ఎవరు ఎక్కువగా వరాలిస్తే ఆ పార్టీదే కేంద్ర పీఠమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రైతుబంధు తరహా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే యోచనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని, ఆ పథకాన్ని ప్రకటించి రైతుల్లో భరోసా నింపగలిగితే ఈ అంచనాలన్నీ మారిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

NATIONAL UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article