చీర కొనబోతే .. లక్ష మాయం చేసిన సైబర్ నేరగాళ్ళు

If you can not buy saree online ..Cyber criminals who lured lakhs

ఆన్ లైన్ లో షాపింగ్ ఓ మహిళ కు లక్ష రూపాయల టోకరా పడేలా చేసింది . ఒక వెబ్ సైట్ లో చీరలు కొందామని చూస్తుంటే… అంతకంటే ఆకర్షణీయమైన చీరలున్న మరో వెబ్ సైట్ కనిపించింది. వెంటనే అందులో ఓ చీర కొనడానికి ఆమె ప్రయత్నించింది. కాగా.. సైబర్ నేరగాళ్లు.. ఆమె ఓటీపీ సాయంతో రూ.లక్ష కాజేశారు. చీర ఆర్డర్ చేసే క్రమంలో ఓటీపీ ఎంటర్ చేయగానే ఆమె ఎకౌంట్ లో రూ.లక్ష కట్ అయ్యాయి. వెంటనే ఇది సైబర్ నేరగాళ్ల పని అన్న విషయం అర్థం చేసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది.

ఖాతాలోని సొమ్ము యూపీఐ ద్వారా బదిలీ అయినట్లు గుర్తించి ఆమె ఖాతాను బ్లాక్‌ చేశారు. కేవలం లక్ష రూపాయల నష్టంతో సైబర్‌ మోసగాళ్ల నుంచి తప్పించుకోగలిగారు. లేకపోతే ఖాతాలోని సొమ్మంతా ఖాళీ అయ్యేది. బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న పోలీసులు టెక్నికల్‌ ఆధారాలను సేకరించారు. ఈ నేరానికి పాల్పడింది బిహార్‌ నుంచి వెళ్లి కోల్‌కతాలో సెటిల్‌ అయిన సైబర్‌ ముఠాగా తేల్చారు. మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు సైబర్‌ కేటుగాళ్లు ముందుగా నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టిస్తున్నారు. అందులో ఆకర్షణీయమైన చీరలను ఉంచి పలు వెబ్‌సైట్లలోకి ఫిషింగ్‌ మెయిల్స్‌ పంపిస్తున్నారు. చీరలకు ఆకర్షితులైన మహిళలు ఆ వెబ్‌సైట్లోకి వెళ్లి ఆర్డర్‌ చేసే క్రమంలో బ్యాంక్‌ ఖాతా, ఫోన్‌ నంబర్లను టైప్‌ చేయగానే ఆటోమేటిక్‌గా ఆ వివరాలన్ని సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. క్షణాల్లో గూగుల్‌పే, పేటీఎం లాంటి ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించే వ్యాల్లెట్లను సృష్టిస్తున్నారు. లావాదేవీలు చేయడానికి అవసరమైన యూపీఐ నంబర్‌ క్రియేట్‌ చేయడం కోసం ఒకే ఒక్కసారి ఓటీపీ అవసరం ఉంటుంది.

కేవలం దాన్ని తెలుసుకోవడానికే సైబర్‌ కేటుగాళ్లు బాధితులకి ఫోన్‌ చేస్తున్నారు. ఆర్డర్‌ ఓకే కోసం అని నమ్మించి ఓటీపీ తెలుసుకుంటున్నారు. నంబర్‌ చెప్పగానే ఖాతాలోని డబ్బులను కాజేస్తున్నారు. బాధితులు గుర్తించి బ్యాంక్‌ ఖాతాను బ్లాక్‌ చేయించే వరకు అందినంత దండుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు.అందుకే పోలీసులు ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దని చెప్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article