టాలీవుడ్ అంతా అదే కదా..?  ఇలియానా అన్నది తప్పా..?

58
iliyana movie update
iliyana movie update

iliyana comments

టాలీవుడ్ అంతా నెపోటిజం పైనే నడుస్తోంది.. అటూ ఇటూగా మాజీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా అన్నమాటలివి. దీంతో ఆమెపై ఓ రేంజ్ లో ట్రోల్స్ మొదలుపెట్టారు నెపోటిజం స్టార్స్ కు సంబంధించిన ఫ్యాన్స్. ఇంకొందరైతే ‘ఏరు దాటాక తెప్ప తగలేసే’ బాపతు అంటూ తామేదో అద్భుతం చెబుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ తరచి చూస్తే తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ఇద్దరు ముగ్గురు తప్ప ఇప్పుడున్న హీరోలు ఎంతమంది బయటి వారున్నారు. ఉన్నా.. వారి సినిమాల విడుదల స్థాయి ఎలా ఉంది. కంటెంట్ తో సంబంధం లేకుండా వారస హీరోల సినిమాలు ఎలా విడుదలవుతున్నాయి. ఓ సాధారణ బయటి కుర్రాళ్లు సినిమా చేసి విడుదల చేయడానికి ఎన్ని అవస్థలు పడుతున్నారు.. ఏ టాలెంట్ లేకున్నా.. పాటలు, ట్రైలర్స్ ఇవేవీ ఆకట్టుకోలేకపోయినా.. వారస హీరోల సినిమాలకు విడుదల విషయంలో ఏ ఇబ్బందీ ఎందుకు రావడం లేదు. నిజమే.. ఇక్కడ వారసత్వం ఎంట్రీ కార్డ్ మాత్రమే. ఆ తర్వాత టాలెంటే ఇంపార్టెంట్ అనేది మెజారిటీ జనం వాదన. అలా అనుకున్నా.. మన వారస హీరోల్లో అబ్బో అద్భుతమైన టాలెంటెడ్ అని చెప్పుకునే వాళ్లు ముగ్గురికి మించి కనిపించడం లేదు. అరంగేట్రం చేసిన తొలినాళ్లలో ప్లాస్టిక్ ఫేస్ లు అనిపించుకుని.. ఆ తర్వాత చాలా చాలా ‘మెరుగులు’దిద్దుకుని వరుసగా కొన్ని సినిమాలు పోయినా.. బ్యాక్ ఎండ్ అండతోనే ఆ హీరోలు తెలుగు ప్రేక్షకుల మీద రుద్దబడి తర్వాత స్టార్స్ అనిపించుకున్నారు. ఇక ఈ పదిహేనేళ్లలో తెలుగులో ఎంతమంది బయటి వాళ్లు స్టార్డమ్ సంపాదించారు.

ఏమైనా చిరంజీవి ఆదర్శంగా వచ్చిన శ్రీకాంత్, రవితేజ స్టార్లు కాలేదా అంటారు. మరి ఆ ఇద్దరే ఇండస్ట్రీ వచ్చారా ఇన్నేళ్లలో. లేదంటే వాళ్లకు మించిన టాలెంట్ ఉన్న వాళ్లు ఇంకెవరూ లేరంటారా..? లేటెస్ట్ గా వచ్చిన రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ సినిమాలో చిరంజీవిన పోలిన పాత్రధారి.. పవన్ ను పోలిన పాత్రధారితో.. ‘నిజం చెప్పరా.. నీకు ఇంత స్టార్డమ్.. ఇమేజ్ వచ్చింది నా వల్ల కాదా..? మరి మాటి మాటికి ఎందుకురా నేనో సాధారణ కానిస్టేబుల్ కొడుకుని అంటావ్’అని  ఓ మాట అంటాడు. ఇది సత్యం కాదా..? నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చారు. మెగా ఫ్యామిలీలో మెల్లగా ఓ క్రికెట్ టీమ్ ఫామ్ అవుతుంది. నిజంగా వీళ్లంతా టాలెంటెడేనా.. అనేది గుండెలపై చేయి వేసుకుని చెప్పే దమ్ముందా ఎవరికైనా..? అలాగే అక్కినేని ఫ్యామిలీలో ఇప్పుడు వారస హీరోలు కాక ‘నటులు’ఎవరైనా కనిపిస్తున్నారా..? లెక్కలు అనేవి తరచి చూస్తేనో లేక వాస్తవాలను అర్థం చేసుకునే అవగాహనా స్థాయి ఉంటేనో తప్ప.. ఇలాంటివి అర్థం కావు. ఏదేమైనా ఫ్యాన్స్ అంటే హీరోలను అభిమానించేవారుగా కాక.. వారికి, వారి కుటుంబాలకు బానిసలుగా ఉన్నంత కాలం.. ఇలియానాలాగా నిజాల గురించి మాట్లాడేవారిపై ఎదురు దాడి సాగుతూనే ఉంటుంది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here