ఇలియానాను వదలని బాలీవుడ్ హీరో

17
iliyana movie update
iliyana movie update

iliyana movie update

ఒక్కసారి సింక్ అయితే ఆ ఇద్దరూ మంచి కెమిస్ట్రీలో సింకింగ్ అయిపోతారనే సామెత సినిమా పరిశ్రమల్లో వినిపిస్తూ ఉంటుంది. అది ఎలాంటి కెమిస్ట్రీ అనేది ఆ ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయం. అయినా బయట వినిపించే కథలు ఆగవు. అవి ఆగకుండా ఉండేందుకు వీరి కొత్త ప్రయత్నాలూ ఆగవు. అలాంటిదే గోవా కోవా ఇలియానా మేటర్. అమ్మడు తెలుగును ఓ ఊపు ఊపేసిన తర్వాత అనూహ్యంగా బాలీవుడ్ కు వెళ్లింది. రెండు మూడు హిట్స్ రాగానే ఇక సౌత్ కు నో ఎంట్రీ అని చెప్పింది. బట్ అక్కడే అమ్మడికి హిట్ అడ్డం తిరిగింది. తొలి రెండు సినిమాలు తప్ప తను చేసిన బాలీవుడ్ సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేదు.. కున్నా.. ఇలియానా కు క్రెడిట్ దక్కలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో అమ్మడిని అజయ్ దేవ్ గణ్ ఆదుకుంటూ వస్తున్నాడు. ఇంతకు ముందు కూడా చేతిలో ఏ ఆఫర్ లేని టైమ్ లో అతనే వరుసగా రెండు సినిమాల్లో ఛాన్స్ లు ఇచ్చాడు. ఇప్పుడు కొత్త సినిమాలు లేక బికినీ ఫోటోలు అప్ లోడ్ చేసుకుంటోన్న తనకు మరో ఆఫర్ ఇచ్చాడు. ఈ మూవీకి నిర్మాత కూడా ఆయనే. మరి ఫ్రీగా చేస్తుందా అని మనం అడక్కూడదు.

ఆఫర్ ఉంది కదా.. అది చాలు.. క్లిక్ అయితే మరిన్ని ఛాన్సులు తేవడానికి. అంచేత.. లేటెస్ట్ గా వెండితెరపై ఫ్లాప్ అయి డిజిటల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ తో పాటుఅమ్మడు కూడా ఓటిటిలోకి ‘నడుము’పెట్టింది. ఇండియన్ ఎకనమిక్ హిస్టరీలో అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్ ఫ్రాడ్ గా చెప్పుకునే హర్షద్ మెహతా కుంభకోణం కేస్ ను పోలినట్టుగా ఉన్న కథతో రూపొందుతోన్న ‘బిగ్ బుల్’ అనే వెబ్ మూవీలో అమ్మడు కీలక పాత్ర చేయబోతోంది. అభిషేక్ బచ్చన్ తో పాటు అజయ్ దేవ్ గణ్ కూడా ఓ ప్రధాన పాత్ర చేస్తున్నాడు. రెగ్యులర్ హీరో, హీరోయిన్ టైప్ కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ గా సాగే వెబ్ మూవీలా కనిపిస్తోందిది. ఏదేమైనా ఇలియానాను ఎవరూ పట్టించుకోక పోయినా అజయ్ దేవ్ గణ్ పట్టించుకుంటున్నాడు. ఏకంగా ఆఫర్స్ ఇస్తున్నాడు.

cinema news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here