అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సంబంధించిన గోవా రెగ్యులరైజేషన్ ఆఫ్ అనాథరైజ్డ్ కన్ స్ట్రక్షన్ (సవరణ) ఆర్డినెన్స్, 2023కి గోవా కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా 2014 ఫిబ్రవరి 28 కంటే ముందు అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేయాలన్న కోర్డు ఉత్తర్వుల నుంచి రక్షించడం వీలవుతుంది. అంతేకాకుండా సదరు ఆస్తి లేదా భూమి చట్టబద్ధంగా విభజించినప్పటికీ, ఇంటి సహ యజమాని సమ్మతి లేదనే కారణంతో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించడం కుదరదు.