చంద్రబాబు ఇల్లు కూల్చేయకుండా నిద్రపోరా?

174
ILLEGAL CONSTRUCTION ON SEA SHORE WILL DEMOLISHED
ILLEGAL CONSTRUCTION ON SEA SHORE WILL DEMOLISHED

ILLEGAL CONSTRUCTIONS DEMOLITION BY CRDA OFFICIALS

కృష్ణా నదీ కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగంలోకి దిగారు సీఆర్డీయే అధికారులు . టీడీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అద్దెకు నివాసం ఉండే ఇంటిని సీఆర్డీఏ అధికారులు కూల్చేస్తామని వారంలో ఖాళీ చెయ్యాలని నోటీసులు అంటించారు. . కరకట్ట మీద నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బాబు అద్దెకుండే నిర్మాణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తున్నారు.అక్రమ నిర్మాణాలు.. కట్టడాలపై ఉక్కుపాదం మోపాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. అందుకు తగ్గట్లే బాబు నివాసంపై అనూహ్య రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. బాబు నివాసంతో పాటు.. మరో రెండు ఇళ్లను కూల్చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే రెండు, మూడుసార్లు సీఆర్డీఏ అధికారులు చంద్రబాబు అద్దెకు ఉండే నివాసానికి నోటీసులు ఇచ్చారు. ఈ ఇంటి యజమాని లింగమనేని రమేశ్ అధికారుల ఎదుట హాజరై.. తన వాదనలు వినిపించారు. ఇదే రీతిలో అక్రమ కట్టడాలుగా భావించి నోటీసులు ఇచ్చిన 20 మంది వాదనలు విన్నారు. తుదకు ఐదు కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి.. నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో ఆ కట్టడాల్ని కూల్చి వేయాలని.. లేకుంటే సీఆర్డీఏ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అధికారులు చెప్పిన రీతిలో ఇంటి యజమానులే తమ నిర్మాణాల్ని తామే కూల్చుకోవటం కానీ.. లేదంటే అధికారులు కానీ కూల్చి వేస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు అద్దెకు ఉండే నివాసంతో పాటు.. శివస్వామి ఆశ్రమంలో ఉన్న రెండు కట్టడాలు.. ఆక్వా డెవిల్స్ పేరుతో ఉన్న మరో కట్టడంతో పాటు ఇంకో మూడు అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు కూల్చేయటానికి రంగం సిద్ధం చేశారు.

AP LATEST NEWS, CHANDRA BABU HOUSE 

మౌనిక మరణానికి బాధ్యులెవరు ?

తెలంగాణాపై ఫోకస్ పెట్టిన బీజేపీ హై కమాండ్

కేసీఆర్ వ్యాఖ్యలతో ఆ స్కీములపై ఆసక్తికర చర్చ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here