నేతలు, అధికారుల అండతో ఇసుక అక్రమ దందా

అనకాపల్లి జిల్లా : చోడవరం నేతలు, అధికారుల అండతో ఇసుక అక్రమ దందా.గజపతినగరంలో రోజు సుమారు 90 టైరు బళ్ళు తో తవ్వకాలు.చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులు.నెల నెల ముడుపులు అందుకుంటున్నారని ఆరోపణలు.అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గజపతి నగరం గ్రామంలో ఇసుక అక్రమ దందా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు నడుస్తుంది.ప్రతిరోజు సుమారు 90కి పైగా శారదా నది లో టైరు బళ్ళు నుంచి ఇసుకను తీసుకువచ్చి అర్ధరాత్రులు లారీలు పై ఇతర ప్రాంతాలకు అనధికారికంగా తరలిస్తూ అక్రమదందా వ్యాపారులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా ఈ వ్యవహారం రెవెన్యూ, పోలీస్ అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article