లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు

లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలి డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. 10 గం. ల తరవాత వీధుల్లో పెద్దఎత్తున జన సంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకై తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉదయం 9:45 గం. ల నుంచే పోలీసు కమిషనర్లు, ఎస్పిలు, డిసిపి, డిఎస్పి, ఏసిపి స్థాయి ఉన్నతాధికారులందరూ కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి అవకాశాలున్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో రద్దీని తగ్గిచేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా మార్కెట్లను వికేంద్రించే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఉదయం 10 గం. ల తరవాత అనుమతి లేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలన్నారు. కేవలం ప్రధాన రహదారుల్లోనే లాక్డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయం ముగియగానే ఉదయం 10 గం. లకు అన్ని పెట్రోలింగ్ వాహనాలు సైరన్ వేసి సంచరించాలని తెలిపారు. లాక్డౌన్ అమలుపై సామన్య ప్రజానీకం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయని, ఈ విషయంలో పోలీసుశాఖపై ఏవిధమైన ఫిర్యాదులు అందడంలేదన్నారు.

  • రాష్ట్రంలో పెట్రోల్ బంకులను పూర్తిస్థాయిలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని, ఐతే లాక్డౌన్ తరవాత కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని స్పష్టం చేశారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article