రసవత్తరంగా రెండో టెస్టు మ్యాచ్‌

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా మారుతోంది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసి ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌కు 26 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఆతిథ్య జట్టు కెప్టెన్‌ జో రూట్‌ (178*) శతకం సాధించగా, బెయిర్‌స్టో (57) హాఫ్ సెంచరీ సాధించాడు. బర్న్స్‌ 49, సిబ్లే 11, బట్లర్ 23, మొయిన్ అలీ 27, రాబిన్‌ సన్ 6, మార్క్‌ ఉడ్‌ 5 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 4, ఇషాంత్‌ 3, షమీ, బుమ్రా చెరో వికెట్‌ తీశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article