India beat West Indies by four wickets in 3rd ODI
నిన్న కటక్ లో జరిగిన విండీస్ భారత్ చివరి వన్డేలో 4 వికెట్లతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా,శార్దుల్ ఠాకూర్ లు మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ ను విజయబావుటా పట్టించారు. 2–1తో సిరీస్ కైవసం చేసుకుంది టీం ఇండియా. నిజానికి విండీస్ మీద భారత్ వరుసగా పది సిరీస్ లు గెలిచినట్లైంది. అయితే ముందుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ తనదైన బ్యాటింగ్ తో అద్భుతాలు సృష్టించగా.. రాహుల్ కి తోడుగా రాహుల్ చక్కని ఆరంభమే ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ చేతులెత్తెయ్యడంతో భారీ స్కోరును సాధించలేమన్న ఒక భయం ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ సమయంలోనే బరిలోకి దిగాడు టీం ఇండియా చిచ్చరపిడుగు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ వీరెవిహారం చేసినప్పటికీ కడదాకా ఉండలేకపోయాడు. దీంతో టీం ఇండియా మరింత కష్టాల్లో పడింది. 30 పరుగుల దూరంలో కోహ్లీ అవుటయ్యాడు. ఇక అప్పుడే మన మాస్ మహారాజ రవీంద్ర జడేజా బ్యాట్ ఎత్తి ఒక్కో బాల్ ని బౌండరీలు బాదాడు. దీంతో హమ్మయ్య అనుకున్నారందరు. జడేజాకు టెయిలెండర్ శార్దుల్ ఠాకూర్ జతయ్యాడు. ఇద్దరూ గెలిపించే మెరుపులతో అలరించారు. కీలకదశలో స్ఫూర్తిదాయక బ్యాటింగ్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్‌పై భారత్‌కు వరుసగా పదోసారి వన్డే సిరీస్ దక్కడంలో ముఖ్యపాత్ర పోషించారు.
స్కోర్ బోర్డు..
వెస్టిండీస్ ఇన్నింగ్స్: ఎవిన్ లూయిస్ 21; షై హోప్ 42; 38; 37; నికోలస్ పూరన్ 89; కీరన్ పొలార్డ్ 74; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 315.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ 63; కేఎల్ రాహుల్ 77; కోహ్లి 85; రవీంద్ర జడేజా (నాటౌట్) 39; శార్దుల్ ఠాకూర్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (48.4 ఓవర్లలో 6 వికెట్లకు) 316.