10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన ఇండియా

INDIA LOST 4 WICKETS IN 10 OVERS

మాంచెస్టర్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ సెమీస్ లో భారత జట్టు చెత్తగా వికెట్ల పతనం కొనసాగుతోంది. టీమిండియా స్కోరు 24 పరుగుల వద్ద వుండగా ధినేశ్ కార్తిక్ (6 పరుగులు) నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. టీమిండియా టాప్ ఆర్డర్ పెవిలియన్ కు క్యూకట్టింది. కేవలం ఐదు పరుగులకే మూడు కీలక వికెట్లు పడ్డాయి. రోహిత్, కోహ్లీలు కేవలం ఒక్కో పరుగు మాత్రమే చేసి ఔటవగా తాజాగా మరో ఓపెనర్ రాహుల్ కూడా ఔటయ్యాడు. టీమిండియా ఓపెనర్లిద్దరిని కూడా హెన్రీ పెవిలియన్ కు చేర్చాడు.

కీలకమైన సెమీఫైనల్లో భారత టాప్ ఆర్డర్ తడబడుతోంది. ఈ టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడి భారత్ ను ఇక్కడివరకు తీసుకువచ్చిన రోహిత్ తో పాటు కెప్టెన్ కోహ్లీ లు సెమీఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆకట్టుకోోలేకపోయారు. వీరిద్దరు చెరో పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు. కోహ్లీని బౌల్ట్ ఓ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించి వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో అభిమానులనే నిరాశపర్చాడు. కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసిన హిట్ మ్యాన్ ను హెన్రీ ఔట్ చేశాడు. దీంతోో భారత్ నాలుగు పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.

మంగళవారం 46.1 ఓవర్లలో 211 పరుగుల వద్ద నిలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఇవాళ(బుధవారం) ప్రారంభమైంది. అయితే ఆరంభం నుండే ధాటిగా ఆడేందుకు ప్రయత్నించి టేలర్(74 పరుగులు) రనౌటయ్యాడు. దీంతో 225 పరుగుల వద్ద ఐదో వికెట్ పడింది. ఆ వెంటనే భువీ బౌలింగ్ లాథమ్ , హెన్రీలు కూడా వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో ఇవాళ నాలుగు ఓవర్లలో మరో 28 పరుగులు మాత్రమే జోడించి కివీస్ 139 పరుగులు చేసింది. దీంతో భారత్ ప్రపంచ కప్ ఫైనల్ కు చేరాలంటే 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వుంది. రెండో రోజు ఆరంభమైన మ్యాచ్ లో కివీస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 225 పరుగుల వద్ద టేలర్ రనౌటయ్యాడు. దీంతో రెండో మ్యాచ్ లో మొదటి వికెట్ పడింది. వర్షం కారణంగా నిన్న(మంగళవారం) అర్థాంతరంగా ఆగిపోయిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యింది. న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 211 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం మ్యాచ్ ను అడ్డుకుంది. ఇలా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే వుండటంతో మ్యాచ్ ఇవాళ్టికి వాయిదా పడింది. దీంతో నిన్న ఎక్కడయితే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడినుండే ఇవాళ మ్యాచ్ ప్రారంభమయ్యింది.

WORLDCUPUPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *