టీమిండియా ఘోర పరాజయం

INDIA LOST T20

  • కివీస్ తో తొలి టీ20లో కుప్పకూలిన భారత జట్టు
  • 80 పరుగుల తేడాతో ఓడిపోయిన వైనం

కివీస్ పర్యటనలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన తొలి టీ20లో దారుణంగా పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చక్కగా రాణించిన న్యూజిలాండ్ జట్టు భారత్ పై ఏకంగా 80 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ (1) ఔటయ్యాడు. ధావన్ (29) కాస్త మెరుపులు మెరిపించినప్పటికీ, జట్టు స్కోర్ 51 పరుగుల  వద్ద రెండో వికెట్ గా వెనుదిరిగాడు. అనంతరం పంత్ (4), శంకర్ (27), కార్తీక్ (5) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో 72 పరుగులకే భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధోనీ (39), కేహెచ్ పాండ్యా (20) ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ, లక్ష్యం కొండంత ఉండటం.. మిగిలిన బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు చక్కని ఆరంభాన్ని ఇవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఓపెనర్ టిమ్ సీఫ్రెట్ 84 (43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్ లు) సెంచరీ కోల్పోగా.. మున్రో 34 (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు), విలియమ్సన్ 34 ( బంతుల్లో ఫోర్లు, సిక్స్ లు) రాణించడంతో భారత్ కు కివీస్ 220 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. భారత బౌలర్లలో హార్థిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. కేకే అహ్మద్, భువీ, చహల్, కేహెచ్ పాండ్యా తలో వికెట్ తీశారు.

SPORTS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article