వలస కూలీలపై సుప్రీం ఏమన్నది?

48
INDIA MIGRANT LABORS
INDIA MIGRANT LABORS

INDIA MIGRANT LABORS

లాక్ డౌన్ కారణంగా దేశంలో వేలాది మంది వలస కూలీలు, కార్మికులు, శ్రామికులు పనులు లేక వివిధ నగరాల నుంచి తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మన ఆకలి కేకల భారతం ఎలా ఉందో పాలకుల పరిస్థితి ఏంటో అర్ధం అవుతుంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ .. వాహన డాక్యుమెంట్ల రెన్యువల్ కు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం వలస కూలీల విషయంలో స్టేటస్ రిపోర్టును సమర్పించిన కేంద్రం వలస కార్మికులను పట్టించుకునే నాధుడు లేక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పొట్ట చేతబట్టుకుని వందలాది కిలోమీటర్ల దూరం మేర నడిచి వెళ్తున్న వలస కార్మికుల పరిస్థితిపై అలోక్ శ్రీవాత్సవ్ అనే లాయర్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను ఇవ్వాళ సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

* ఈ పిటిషన్ పై సీజెఐ ఎస్.ఏ.బాబ్డే ఆధ్వర్యాన గల ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ జరిపిన విచారణలో వలస కూలీల విషయంలో స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది కేంద్రం. వలస కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేదని సుప్రీం కు చెప్పిన కేంద్రం కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం జనవరి 17 నుంచే ముందస్తు నివారణ చర్యలు చేపట్టిందని, ఇక వలస కార్మికుల విషయంలో కూడా వారికి ఇబ్బంది కలుగకుండా నిర్ణయం తీసుకుందని చెప్పింది. సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వలస కార్మికుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్ళారు.

* వలస కూలీల కోసం అన్ని రాష్ట్రాల్లో వసతి గృహాలు ఏర్పాటు, భోజన వసతి, స్క్రీనింగ్, మెడికల్ వసతులు కల్పించామని తెలిపారు సొలిసిటరీ జనరల్. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాల మేరకు వలస కూలీలను వసతి గృహాలకు తరిలించినట్లు చెప్పారు.ఇక వలస కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. విచారణ తర్వాత సుప్రీం కీలక ఆదేశాలు అయితే పిటీషనర్ తరపున న్యాయవాది వలస కూలీల విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదించారు. దీంతో సుప్రీం ధర్మాసనం వలస కూలీలకు వసతి గృహాలు, భోజనం, మెడికల్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది.

Tags: Corona Pandemic Daily Wage Laborers, No Work, Hunger In Mumbai, Migrant Labor, Telugu States, Supreme Court, Alok Srivasthava

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here