మ్యాచ్ ను అడ్డుకున్న సూర్యుడు

INDIA-NEW ZEALAND MATCH DELAYED BY SUN

  • సూర్యకిరణాల కారణంగా ఆగిన భారత్-కివీస్ వన్డే

సాధారణంగా వర్షం వస్తేనో, వెలుతురు సరిగా లేకుంటేనో క్రికెట్ మ్యాచ్ లు ఆగిపోవడం మనకు తెలుసు. కానీ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేపియర్ లో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ మాత్రం సూర్య కిరణాల కారణంగా ఆగిపోయింది. కాస్త విచిత్రంగా అనిపించినా ఇది నిజం. సూర్య కిరణాలు నేరుగా బ్యాట్స్ మెన్ కళ్లలోకి పడుతుండటం వల్ల వారు బంతిని గుర్తించడానికి నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. సాధారణంగా క్రికెట్ గ్రౌండ్ లో పిచ్ లు దక్షిణం, ఉత్తరం దిశలో ఉండాలి. కానీ నేపియర్ పిచ్ మాత్రం తూర్పు, పడమర దిశలో ఉంది. దీంతో సూర్య కిరణాలు నేరుగా బ్యాట్స్ మెన్ కళ్లలోకి పడుతున్నాయి. కాగా, ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు పది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (29), కోహ్లీ (2) క్రీజ్ లో ఉన్నారు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది.

CRICKET UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article