‘చెక్’ రిపబ్లిక్ తప్పే మనమూ..

India did same mistake what Czech Republic did last year. During First Wave Only 500 people died. But, Still They conducted Elections in Last October, After that they went for lockdown, but still 8000 people died after elections.

170
India Repeated Czech Republic Mistake
India Repeated Czech Republic Mistake

కరోనా సమయంలో చెక్ రిపబ్లిక్ తప్పుడు నిర్ణయం తీసుకుంది. కేసులు తక్కువున్నాయనే కారణంతో గతేడాది అక్టోబరులో ఎన్నికల్ని నిర్వహించింది. ఆ తర్వాత లాక్ డౌన్ విధించింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గతేడాది చెక్ రిపబ్లిక్ పరిస్థితికి ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితులకు ఎలాంటి తేడా లేదు. ఎలాగంటారా?

గతేడాది ఆగస్టులోనే అధిక శాతం యూరిపోయిన్ దేశాల్లో కరోనా రెండో వేవ్ ప్రభావం కనిపించింది. అప్పటివరకూ తక్కువగా ఉన్న కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చెక్ రిపబ్లిక్ ఇందుకు మినహాయింపేం కాదు. ఒకవైపు ఆగస్టులో కేసులు నమోదు అవుతున్నప్పటికీ, ప్రజల జీవితం మాములుగానే సాగింది. కాకపోతే, అక్కడ అక్టోబర్ 3 న ఎన్నికల్ని నిర్వహించారు. ఆ తర్వాతే అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరోనా పూర్తిగా పాకిపోయింది. అదెంత వినాశకరంగా మారిందంటే.. మొదటి వేవ్ లో ఆ దేశంలో 500 కంటే తక్కువ మంది మరణిస్తే.. ఆతర్వాతి మూడు నెలల్లో ఎనిమిది వేలకు పైగా మరణించారు. ఆ దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. ఒక్క చిన్న తప్పు ఎంత పెద్ద చిచ్చు రేపిందో ఆలోచిస్తుంటేనే భయమేస్తోంది. కొన్ని నెలల వ్యవధిలోనే 500 మరణాల స్థానంలో 8000కు చేరిందంటే పరిస్థితి ఎంత భయానకంగా మారిందో చూడండి. కోటీ పది లక్షల జనాభా గల ఆ చిన్న దేశంలోనే పరిస్థితి అంత దారుణంగా తయారైతే, 130 కోట్ల జనాభా గల మనదేశంలో పరిస్థితి మరెంత దారుణంగా మారే ప్రమాదముంది. కనీసం ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి. అక్టోబరు తర్వాత అక్కడి ఆస్పత్రుల్లో పని చేసేవారికి సెలవులు లేనే లేవు. రాత్రింబవళ్లు పని చేసేవారు. ఎన్నికలేమో ప్రభుత్వం నిర్వహించింది. పర్యావసనాన్ని ప్రజలు ఎదుర్కొన్నారు. ఎవరి పాపం.. ఎవరికి శాపంగా మారింది? మరి, మన దేశం ఎటువైపు పయనిస్తోంది? కరోనా సెకండ్ వేవ్ కార్చిచ్చును ఆపడంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అందుకే, ప్రజలకీ దుస్థితి ఎదురవుతోంది. కాబట్టి, ఇప్పటికైనా ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండటం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here