మళ్లీ కరోనా కలవరం మొదలు

146
India reported 47,029 coronavirus case
India reported 47,029 coronavirus case

దేశంలో మరోసారి కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో కొత్త కేసులు 47 వేలు దాటగా మరణాలు కూడా 500 పైనే నమోదయ్యాయి. కొత్త కేసులు ఈ స్థాయిలో ఉండటం రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అయితే కొత్త కేసుల్లో 70శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఒక్క కేరళలో 32 వేల 803 కొత్త కేసులు వెలుగు చూశాయి. మరోవైపు. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండటం కలవరపెడుతోంది. అంతేకాదు ఒక్క రాష్ట్రంలోనే 173 మరణాలు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here