టీమిండియా భారీ స్కోర్..347

India Set 348 target for New Zealand

టీమిండియా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే న్యూజిలాండ్ తో టీ20లో తలపడిన భారత్ ఐదు మ్యాచులను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం భారత్, న్యూజిలాండ్ మళ్లీ వన్డే సీరిస్ లో తలపడుతుంది. నేడు మొదలైన ఫస్ట్ వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా..టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్ బరిలో దిగారు. అయితే ముందునుంచే టీమిండియా ప్లేయర్స్ దూకుడుగా ఆడటం ప్రారంభించారు. గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం  అయినప్పటికీ యువరక్తం ఉరకలేసింది. కెప్టెన్ కోహ్లీ ఆఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచులో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో  నాలుగు వికెట్లు కోల్పోయి 347  భారీ పరుగులు చేసింది.  శ్రేయాస్ 103 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించాడు. మరో విశేషం ఏంటంటే ఈ సెంచరీ అయ్యర్కు మొదటి సెంచరీ కావడం. ఇక  కేఎల్ రాహుల్ 88 పరుగులతో నాటౌట్ గా నిలవగా.. కోహ్లీ 51 చేశాడు.  చివరలో కేదార్ జాదవ్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 15 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

India set 348-run target for New Zealand,India gave 348 runs target to New Zealand,India vs New Zealand, Live Score,1st ODI, Match at Hamilton,Kohli,Shreyas Iyer 1st Century

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *