INDIA SET KIWIS 325 TARGET
- కివీస్ కు 325 పరుగుల లక్ష్యం నిర్దేశించిన టీమిండియా
న్యూజిలాండ్ తో మౌంట్ మాగానీలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి, కివీస్ ముందు 325 పరుగుల విజయం లక్ష్యం ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు చక్కని శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్(66; 67 బంతుల్లో 9 ఫోర్లు) అర్థసెంచరీలు చేయడంతో తొలి వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అనంతరం కొద్ది పరుగుల తేడాలోనే ఇద్దరూ ఔటయ్యారు. ఈ దశలో విరాట్ కోహ్లి(43; 45 బంతుల్లో 5 ఫోర్లు) , అంబటి రాయుడు(47; 49 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు ఉరకలెత్తింది. స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్ యత్నించి కోహ్లి ఔటయ్యాడు. తర్వాత రాయుడు కూడా పెవిలియన్ బాట పట్టాడు. చివర్లో ఎంఎస్ ధోని(48 నాటౌట్;33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), జాదవ్(22 నాటౌట్; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా స్కోరు 300 పరుగులు దాటింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఫెర్గ్కుసన్‌లు తలో రెండు వికెట్లు తీశారు.