భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌ కు విశాఖ వేదిక కాబోతోంది

భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌ కు విశాఖ వేదిక కాబోతోంది.కరోన ప్రభావంతో ఫుల్ కిక్ ను మిస్ అయిన క్రికెట్ అభిమానులకు ఈ సారి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.వచ్చే నెల 14వ తేదీన విశాఖలో నిర్వహించనున్న మ్యాచ్ కు 100 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించింది.దింతో క్రికెట్ దేవుళ్ళ దర్శన భాగ్యం ఎప్పుడెప్పుడా వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

వచ్చే నెల విశాఖ వేదికగా జరిగే మ్యాచ్ కు సంభవించి ఏర్పాట్లపై వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే నెల 14వ తేదీన విశాఖలో నిర్వహించనున్న భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌పై చర్చించారు. విశాఖలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా విశేషమైన స్పందన లభిస్తోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం 27 వేల మంది కెపాసిటీని కలిగి ఉందని.. ఈ మ్యాచ్‌కు తాము పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article